టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వెలువడింది.
నవీన్ పోలిశెట్టి సక్సెస్ జర్నీ
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్ పోలిశెట్టి, తన నటనతో క్రమంగా స్టార్ హీరోగా ఎదిగాడు. మొదట్లో చిన్న చిత్రాల్లో కనిపించిన నవీన్‌కు ‘జాతిరత్నాలు’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించింది. ఆ తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు.
ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో తన హిట్ ట్రాక్‌ను కొనసాగించాడు.
బాక్సాఫీస్ వద్ద భారీ విజయం
సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహించగా, నవీన్ పోలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
నవీన్ నటన హైలైట్
ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు. ముఖ్యంగా అతడి పంచులు, ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకు బలంగా నిలిచాయి. కుటుంబ కథతో పాటు కామెడీ ఎలిమెంట్స్ ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.
ఫిబ్రవరి 11 నుంచి ‘అనగనగా ఒక రాజు’ స్ట్రీమింగ్ కానుంది అని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
ఇంతకు ముందు వినిపించిన రూమర్స్‌కు చెక్ పెడుతూ, ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
కథలోకి వెళ్తే…
గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు (నవీన్ పోలిశెట్టి). పేరు మాత్రం జమీందారిదే కానీ, చేతిలో డబ్బు ఉండదు. తన స్నేహితుడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ కావడంతో, రాజు కూడా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అలా పెద్దపాలెం గ్రామానికి చెందిన ధనవంతుడు భూపతి రాజు (రావు రమేశ్) కూతురు చారులత (మీనాక్షి చౌదరి) ప్రేమలో పడతాడు. పెళ్లి తర్వాత రాజుకు తెలిసిన ఒక నిజం అతడి జీవితాన్నే మార్చేస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే సినిమా కథ.



