అమరావతిలో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

అమరావతి:అమరావతి పరిధిలోని మంగళగిరి 6వ  పోలీసు బెటాలియన్ (APSP)లో రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్యఅతిథిగా హాజరై టోర్నమెంట్‌ను అధికారికంగా ప్రారంభిం చారు.

   దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులు క్రికెట్ జట్లుగా ఏర్పడి ఈ ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటుండగా,సుమారు ఆరు రాష్ట్రాల నుంచి మొత్తం 10జట్లు ఈ పోటీ లో నిలిచాయి.ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర హోమ్ మంత్రి వంగల పూడి అనిత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం క్రికెట్ క్రీడను ప్రారంభించారు. 

 ఈ పోలీసు క్రికెట్ మ్యాచ్‌ లు మొత్తం 5, రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా మూలపాడు ఏ.సి.ఏ క్రికెట్ స్టేడియంలో జరగనున్నా యి.ఈ సందర్భంగా రాష్ట్ర హోమ్ మంత్రి వంగల పూడి అనిత మాట్లాడు తూ,పోలీసులుఅను నిత్యం ప్రజల భద్రత కోసం గంటలుకొద్ది,వారి డ్యూటీ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తూ ఈ సమాజాని కి అంకితభావంతో సేవలు అందిస్తున్నారని పేర్కొ న్నారు.ఇలాంటి క్రీడా కార్యక్రమాలు వారి లో ఐక్యతను పెంపొందిం చడమే కాకుండా శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగి స్తాయని అన్నారు.క్రీడల్లో పాల్గొనడం ముఖ్యమని, గెలుపు మాత్రమే లక్ష్యం కాకూడదని మంత్రి పోలీసు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.

       అలాగే,అమరావతి ప్రజల రాజధాని అని, దానిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేం దుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి అనిత అన్నారు.పోలీసు లలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి ప్రత్యేకమైన క్రికెట్ టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమం అనంతరం హోంమంత్రి అనితను పోలీసులు,పలువురు పోలీసు అధికారులు  ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా,ఐజీపీ స్పోర్ట్స్ కే.వి. మోహన్ రావు,డీఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కేకేఎన్ అనుబురాజన్ వంటి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి