ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ఓ కొత్త దశలోకి అడుగుపెట్టింది. AI మోడల్స్‌ను ఉపయోగించాలంటే తప్పనిసరిగా క్లౌడ్ కనెక్షన్ ఉండాలన్న నిబంధనను గూగుల్ పూర్తిగా తుడిచిపెట్టేసింది. అదే కోణంలో తాజాగా గూగుల్ విడుదల చేసిన ‘AI Edge Gallery’ అనేది Android యూజర్ల కోసం ఓ పవర్‌ఫుల్ ఆఫ్‌లైన్ AI టూల్.
ఇంటర్నెట్ అవసరం లేకుండానే AI మేజిక్!
ఈ యాప్ స్పెషాలిటీ ఏంటంటే… మీరు ఆన్‌లైన్‌లో లేకపోయినా, AI మోడల్స్ సొంతంగా మొబైల్ ప్రాసెసర్‌తోనే పనిచేస్తాయి. అంటే, ఫోన్‌లోనే ఇమేజ్ జనరేషన్, కోడింగ్, కంటెంట్ రైటింగ్, క్యూక్షన్-అన్సర్ వంటివన్నీ చేయవచ్చు. పైగా, యూజర్ డేటా పూర్తిగా ఫోన్‌లోనే ఉంటుంది, ఎక్కడికీ వెళ్లదు. ఇది ప్రైవసీ పరంగా గూగుల్ తీసుకున్న అడుగు మెరుగైనదిగా చెప్పాలి.
డేటా ప్రైవసీకి హై స్కోర్
సర్వర్ కనెక్షన్ అవసరం లేకపోవడం వల్ల సెక్యూరిటీ రిస్క్ అనేది మినిమమ్. అంతేకాదు, ఎలాంటి ల్యాగ్ లేకుండా యాప్ స్పందన ఉంటుంది. లోకల్ ప్రాసెసింగ్ వల్ల స్పీడ్ మరింత వేగంగా ఉంటుంది.
బ్యాకెండ్‌లో గెమ్మా మోడల్
ఈ యాప్ పునాది Gemma 2B లాంగ్వేజ్ మోడల్. ఇది గూగుల్ డెవలప్ చేసిన లైట్‌వెయిట్ మోడల్, కేవలం 529 MB పరిమాణంతో వస్తుంది. Apache 2.0 లైసెన్స్ కింద విడుదలైంది కాబట్టి ఎడ్యుకేషన్, కమర్షియల్ అవసరాలకు కూడా అందుబాటులో ఉంటుంది.
Gemma మోడల్ ప్రతిసెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు – అంటే పెద్ద పరిమాణంలో ఉన్న డాక్యుమెంట్లు, కంటెంట్‌ను వేగంగా విశ్లేషించి ఔట్‌పుట్ ఇవ్వగలదు. స్మార్ట్ రిప్లయ్, డాక్యుమెంట్ సమ్మరీ, కంటెంట్ క్రియేషన్ అన్నీ ఈ చిన్న మోడల్ ద్వారా సాధ్యమవుతున్నాయి.
ప్రస్తుతం Android-కే లభ్యం, త్వరలో iOSలోకి
AI Edge Gallery యాప్ ప్రస్తుతం ఓపెన్ సోర్స్‌లో Android ప్లాట్‌ఫామ్‌కి లభ్యమవుతోంది. గూగుల్ ప్రకారం త్వరలో iOS వెర్షన్ కూడా మార్కెట్‌లోకి రాబోతోంది.
AI ఫ్యూచర్‌కి దోహదం చేసే దిశగా గూగుల్ వేసిన మరో కీలక అడుగు ఇది. డివైస్‌లోనే AI రన్ చేయడం ద్వారా డేటా ప్రైవసీకి గరిష్ఠ ప్రాధాన్యం ఇస్తూనే, ఆఫ్‌లైన్ వాడకానికి మార్గం సుగమం చేసింది. ఈ యాప్ డెవలపర్లు, టెక్ ఎక్స్‌ప్లోరర్లు, విద్యార్ధులు… అందరికీ ఉపయోగపడేలా ఉంది.
ఒకే లైన్లో చెప్పాలంటే – “ఇంటర్నెట్ లేని చోట కూడా ఇంటెలిజెన్స్ కనెక్ట్ చేయాలంటే.. ఇది తప్పనిసరి యాప్!”