18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు: ఏఐ సాయంతో గర్భం దాల్చిన మహిళ – వైద్య రంగంలో అద్భుతం!

ai-helps-woman-conceive-after-18-years

పిల్లలు కావాలనే ఆకాంక్షతో 18 ఏళ్లు పాటు నిరీక్షించిన ఒక జంటకు కృత్రిమ మేధస్సు (AI) ఆశజనక ఫలితం అందించింది. అజూస్పర్మియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్న భర్త వీర్యంలో ఒకే ఒక్క జీవన వీర్యకణాన్ని గుర్తించి, ఐవీఎఫ్ పద్ధతిలో భార్య గర్భం దాల్చింది. ఈ ప్రయోగాన్ని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ (CUFC) వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.

ఏమైందంటే..?

ఈ దంపతులు వివాహానంతరం సంతానాన్ని పొందేందుకు ఎన్నో IVF ప్రయత్నాలు చేశారు. కానీ భర్తలో వీర్యకణాల జాడ కనబడక, ప్రతి సారి విఫలమయ్యారు. చివరికి CUFC వద్ద పరీక్షలు నిర్వహించగా, అక్కడి పరిశోధకులు STAR (Sperm Tracking and Recovery) అనే కొత్త టెక్నాలజీని ఉపయోగించారు.

STAR టెక్నాలజీ శక్తి ఎంతంటే..

ఈ పద్ధతిలో భర్త శాంపిల్‌ను గమనించి, AI మోడల్స్ సాయంతో గంట వ్యవధిలో 44 వీర్యకణాలను గుర్తించారు. వీటిలో healthiest కణాన్ని తీసుకుని, భార్య అండాన్ని ఫలదీకరించి గర్భాశయంలోకి నాటారు. ఫలితంగా ఆమె గర్భం దాల్చినట్లు వైద్య బృందం వెల్లడించింది.

ప్రపంచంలోనే తొలిసారి!

ఈ STAR టెక్నాలజీ ద్వారా గర్భం దాల్చిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందింది. “నిజమా అనుకునేంత కాలం పట్టింది.. మేం ఆశించిన దానికంటే గొప్ప ఫలితం ఇది” అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

వైద్య చరిత్రలో కీలక మలుపు

ఈ పరిశోధనను డాక్టర్ జెవ్ విలియమ్స్ నేతృత్వంలోని బృందం దాదాపు 5 ఏళ్ల పాటు అభివృద్ధి చేసింది. “ఇది కేవలం ఒక విజయమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పుట్టుకోని పసిపిల్లల చిరునవ్వుల ప్రారంభం” అని డాక్టర్ వ్యాఖ్యానించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి