ఆచార్య నాగార్జున యూనివర్సిటీ UG, PG దూరవిద్య పరీక్షల ఫలితాలు విడుదల

నాగార్జున నగర్‌: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (Acharya Nagarjuna University) దూరవిద్య కేంద్రం పరిధిలో నిర్వహించిన యూజీ, పీజీ కోర్సుల పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన పలు కోర్సుల పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు, రెక్టార్ ప్రొఫెసర్ ఆర్. శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం సంయుక్తంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా అధికారులు బిఏ, బీకాం, బిబిఎ తృతీయ సెమిస్టర్‌ మరియు ఎంబిఏ మొదటి సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.

విద్యార్థులు రీవాల్యుయేషన్‌ కోసం నవంబర్‌ 12వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని యూనివర్సిటీ సూచించింది. యూజీ కోర్సులకు ప్రతి పేపర్‌కు రూ.770, పీజీ కోర్సులకు ప్రతి పేపర్‌కు రూ.960 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల విభాగ కోఆర్డినేటర్ ఆచార్య డి. రామచంద్రన్, డిప్యూటీ రిజిస్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు పి. కృష్ణవేణి, డి. కోదండపాణి, సూపరింటెండెంట్ టంకశాల వెంకటేశ్వర్లు, జవ్వాజి శ్రీనివాసరావు, మాధురి, దూరవిద్య ఐసీటీ విభాగ డైరెక్టర్ ప్రభాకర్‌రావు, కంప్యూటర్ విభాగ ఇన్‌ఛార్జ్ వలి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి