నాగార్జున నగర్:
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (CDE) ద్వారా 2026 క్యాలెండర్ ఇయర్‌కు సంబంధించి పీజీ దూరవిద్య కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (DEB) అనుమతులతో సెమిస్టర్ విధానంలో మొత్తం 23 పీజీ కోర్సులు నిర్వహించేందుకు అనుమతి లభించిందని ఆయన వెల్లడించారు. ఈ కోర్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 25, 2026తో ముగుస్తుందని తెలిపారు.
కోర్సుల వివరాలు
◆ పీజీ ఆర్ట్స్ విభాగంలో (11 కోర్సులు):
ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, జర్నలిజం, హెచ్.ఆర్.ఎం.
◆ పీజీ కామర్స్ & మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్ (3 కోర్సులు):
ఎం.కామ్, అకౌంటెన్సీ, బ్యాంకింగ్, ఎంబీఏ (జనరల్).
◆ లైబ్రరీ సైన్స్ ప్రోగ్రామ్:
మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (MLISc).
◆ పీజీ సైన్స్ విభాగంలో (8 కోర్సులు):
ఎమ్మెస్సీ బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ.
కోర్సుల కాల వ్యవధి, విద్యా అర్హతలు, ఫీజులు తదితర పూర్తి వివరాలను
👉 www.anucde.info వెబ్‌సైట్‌లో
లేదా
📞 0863-2346222, 98484 77441 నంబర్లలో సంప్రదించవచ్చని సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు.



