ఆచార్య నాగార్జున వర్శిటీ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల.

◆ 23 పీజీ కోర్సులకు యూజీసీ డెబ్ అనుమతి.

◆ అక్టోబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ.

◆ సిడిఈ డైరెక్టర్ ప్రొఫెస‌ర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు.

గుంటూరు;ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సిడిఈ డైరెక్టర్ ప్రొఫెస‌ర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు.

2025 – 26 విద్యా సంవత్సరానికి సెమిస్టర్ విధానంలో
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) 23 పీజీ కోర్సులకు అనుమతి లభించిందన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 10వ తేదీతో ముగియ‌నుంద‌ని ఆయన తెలిపారు.

కోర్సుల వివరాలు.

పీజీ ఆర్ట్స్ లో….
ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, జర్నలిజం, హెచ్ఆర్ఎం వంటి 11 కోర్సులు, పీజీ కామర్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఎం కామ్ అకౌంటెన్సీ, బ్యాంకింగ్, ఎంబీఏ జనరల్ మొత్తం 3 కోర్సులు, లైబ్రరీ ప్రోగ్రామ్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సు అందుబాటులో ఉన్నాయన్నారు.

పీజీ సైన్స్ విభాగంలో…
ఎమ్మెస్సీ బొటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ తదితర 8 సైన్స్ కోర్సులలో ప్రవేశం పొందే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని వెంకటేశ్వర్లు తెలిపారు.

కోర్సుల కాల వ్యవధి, విద్యా అర్హతలు, ఫీజులు తదితర వివరాలను www.anucde.info వెబ్ సైట్ నుంచి లేదంటే ఫోన్ నంబర్స్ 0863-2346222, 98484 77441 లలో సంప్రదించవచ్చుని డైరెక్టర్ ప్రొఫెస‌ర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఎంబీఏ,ఎంసీఏ ప్రవేశాలు .
◆ సెప్టెంబర్ 21న ప్రవేశ పరీక్ష.
2025 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. దీని ద్వారా రెండేళ్ల కాలపరిమితితో ఉండే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను  దూర విద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెస‌ర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు వెల్లడించారు

ఎంబీఏ కోర్సులో…. ప్రవేశం పొందుకోరు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలన్నారు.అయితే పదో తరగతి లేదా ఇంటర్ లేదా డిగ్రీలో తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ చదివి ఉండాలని తెలిపారు.

ఎంబీఏ కోర్సులో….
జనరల్‌లో ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్‌, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ట్రావెల్ టూరిజం మేనేజ్మెంట్, బిజినెస్ ఎనాలిటిక్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ మొత్తం 8 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అందులో రెండిటిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంసీఏ కోర్సులకు డిగ్రీలో తప్పనిసరిగా మ్యాథ్స్‌ చదివి ఉండాలి. డిగ్రీలో మ్యాథ్స్‌ చదవని విద్యార్థులు ఇంటర్‌లోనైనా మ్యాథ్స్‌ సబ్జెక్టును చదివి ఉండాలి అని వెల్లడించారు.దూర విద్యలో మ్యాథ్స్‌ డిగ్రీ చదివిన వారిని కూడా అర్హులుగా గుర్తిస్తారన్నారు.

సెప్టెంబర్ 21న ఏఎన్యూ ప్రవేశ పరీక్ష. ఉంటుందన్నారు.అయితే ఏపీ ఐసెట్ 2025లో ర్యాంక్ పొందిన అభ్యర్థులు నేరుగా కోర్సులలో ప్రవేశం పొందవచ్చని వెల్లడించారు.వీరికి ప్రవేశ పరీక్ష మినహాయింపు ఉంటుందని తెలిపారు.

మరిన్ని వివరాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్య కేంద్రం www.anucde.info అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు. లేదా 98484 77441, 0863-2346323 నెంబర్లను సంప్రదించవచ్చుని డైరెక్టర్ ప్రొఫెస‌ర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి