నాగార్జున నగర్;ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అకాడమిక్– ఇండస్ట్రీ సమ్మిట్–2026 ను వచ్చే మార్చి 5, 6, 7 తేదీల్లో నిర్వహించనున్న ట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.ఈ సమ్మిట్‌కు మహాదేవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరియు ఎన్టీఆర్ బయో సెన్సర్స్ ఇండియా వంటి ప్రముఖ పరిశ్రమలు సహ కరిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖ పరిశ్రమ లు,విశ్వవిద్యాలయ అధ్యాపకులతో ప్రత్యక్ష పరస్పర చర్య (ఫ్యాకల్టీ ఇంటరాక్షన్) నిర్వహించ డంతో పాటు,కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ (ప్రోడక్ట్ ఇన్నోవేషన్) అంశాలపై చర్చలు జరపనున్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అధ్యాపకు ల నైపుణ్యాలను పెంపొం దించేందుకు,ఆయా పరిశ్రమలకు ఫ్యాకల్టీని పంపించి ప్రత్యక్ష పరిశ్రమ శిక్షణ (ఇండస్ట్రీ ట్రైనింగ్) అందించేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అదేవిధంగా,విద్యార్థుల కు ఉద్యోగాలు,ఇంటర్న్ షిప్‌లు,పరిశోధనా ప్రాజెక్టు లు అందించే అవకాశాల ను కూడా ఈ సమ్మిట్ ద్వారా కల్పించనున్నారు. విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు తగ్గ నైపుణ్యాలు సాధించేందు కు ఇది దోహదపడనుంది.
ఈ అకాడమిక్–ఇండస్ట్రీ సమ్మిట్‌లో ఆక్వాకల్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్,మేనేజ్‌మెంట్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్,మెకానికల్ ఇంజినీరింగ్ తదితర అన్ని విభాగాలుపాల్గొననున్నా యి.ఈ కార్యక్రమం ద్వారా విద్య,పరిశోధన,పరిశ్రమల మధ్య బలమైన అను సంధానం ఏర్పడుతుందని విశ్వవిద్యాలయ అధికారు లు ఆశాభావం వ్యక్తం చేశారు.



