ఇది కధ కాదు,జీవిత సత్యం….!చదవాల్సిందే

కప్పుడు ఆడి కారులో తిరుగుతూ జీవనం సాగించిన ఓ వ్యక్తి, ప్రస్తుతం తినేందుకు ఆహారం లేక, చేతిలో నయాపైసా లేక రోడ్ల వెంట ఫ్లాట్ ఫామ్ పై జీవితం చాలా భారంగా నెట్టుకువస్తున్నాడు. ఇదేమీ సినిమా కథ కాదు…!!కొందరి జీవితాలే సినిమా కథలుగా మారిపోతున్నాయి.ఎంత ఎదిగి నా,ఎంత ధనం ఉన్నా…., ఎంత విద్యావంతులైనా, మనిషిగా జీవితం అనేది అంతులేని పోరాటం అని కొన్ని కొన్ని సందర్భాలలో మనకు గుర్తుచేస్తూ ఉంటుంది జీవితం అనేది.అటువంటిదే ఈ వ్యక్తి కధ.

కర్ణాటకలోని రోడ్లపై బిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఓ వ్యక్తి జీవిత కథ సోషల్ మీడియాలో బాగా వైరల్‌ గా మారింది.ఆ వీడియో లో కనిపించిన ఓ వ్యక్తి మ*ద్యం మ-త్తులో ఉన్నాడు.అతని మాటలు వింటే జీవితం ఇలా ఉంటుందా.? అలా మెరిసి,ఇలా మురిసి, టక్కున మాయమైనట్లు ఏమిటబ్బా…ఈ జీవితం అనిపిస్తుంది.ఆయన చెప్పే వేదనాత్మక మాటలు, ఆయన జీవిత అనుభవాలు మన జీవితాలను ఓ సారి అలా మనసును తట్టిలేపుతుంది ఈ కధ,ఒక వ్యధ.

కర్ణాటకలో ఇతను కొన్ని అవాంతర పరిస్థితి లో అన్ని కోల్పోయిన వ్యక్తి లా ఓ వీడియోలో కనిపిస్తున్న దృశ్యం చక్కర్లు కొడుతోంది.పరిస్థితి ఏదైనా కావచ్చు. లేదు,స్వయం కృపారాధం కావచ్చు.ఓ జ్ఞానవంతుడు సైతం కాలం కొట్టే దెబ్బకు విలవిలలాడి పోతున్నాడు.ఇక అతని మాటల్లో అతని వేదన ఇలా ఉంది.ఎంబిఏ పట్ట భద్రుడని,ఒకప్పుడు నెలకు లక్షల రూపాయలు సంపాదించేవాడినని,చాలా విలాసవంతమైన జీవితం గడిపేవాడినని, ‘ఆడి’ కారులో తిరిగే వాడినని,నెలకు లక్ష రూపాయలు జీతం అని చెబుతాడు.అదే వ్యక్తి ప్రస్తుతం చెప్పుల్లేకుండా కర్నాటక వీధుల్లో భిక్షాటన చేయాల్సిన పరిస్థితికి వచ్చాడు.అతని మాటల్లో వ్యక్తమైన బాధ అయ్యో పాపం కొన్ని జీవితాలు ఇంతే అన్నంత తేలిక భావనలోకి మనల్ని తీసుకువెళుతుంది.అన్నీ ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంటుందో…ఏమీ అనుకూలంగా లేనప్పుడు ఏ విధంగా మలుపులు తిరుగుతుందో మనిషి ఆలోచించాలి అని చెప్పే ఫీచర్ రైటింగ్ కధ ఇది.

ఈ కథలో మరోకోణం ఉన్నట్లు అతనే చెబుతాడు.తన భార్య ఇ*ల్లీగల్ ఎఫైర్ వల్ల ఏర్పడిన విభేదాలను అతని జీవితాన్ని తలకిందులా మార్చేసిందనే మానసిక క్షోభతో పాటు, స్థిరంగా నిలబడలేని స్థితి అతనిని నడివీధికి నెట్టేయ గా విధివం*ఛనలో ఇత గాడి జీవితం రోడ్డున పడింది అనేలా అతని మాటలు ఉన్నాయి.ఓ వ్యక్తి ఎలా ధనవంతుడి నుంచి మానసిక పరిస్థితి కోల్పోయిన బిచ్చగాడిలా, మ-ద్యం మ/త్తుకు బానిస లా మారతాడో దీని ద్వారా అర్థమవుతుంది.మరో కోణంలో ఆశలపల్లకిలో ఉన్నాడు.తన పరిస్థితి ఎంత దుర్భరమైనదైనా, అతడు గర్వంగాచెప్పే విషయం మాత్రం మరొకటి ఉంది. “నా కుమార్తె విజ యవాడలోని సిద్ధార్థ మెడి కల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోందని,త్వరలోనే డాక్టర్ అవుతుంది అంటాడు.” ఈ మాటలు వినగానే ఎవరైనా కన్నీటి పర్యంతం కావలసిందే.

కాలం ఒక వృత్తం- జీవిత బుద్ధి మారాలని,ఎవరి జీవితం ఏ క్షణంలో…ఎలా మారుతుందో…అని అతను చెప్పే మాటలు చాలా ఆలోచింపజేస్తున్నాయి.”కాలం ఒక వృత్తంలా తిరుగుతూ ఉంటుంది. ఎవరూ ఎప్పటికీ ఒకే స్థితిలో ఉండరు.సంపద, సుఖాలు శాశ్వతం కావు. బలమైన సంబంధాలు, మానవత్వం ఉంటేనే మనిషి నిలబడగలడు.” అంటూ అతను చెప్పే జీవిత సత్యాలు వింటే తాను అన్నీ కోల్పోయినా తన కూతురు డాక్టర్ అవుతుంది అనే నమ్మకమే అతనికి జీవితం అయ్యింది.ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరికీ ఒక స్పష్టమైన సందేశం అందుతోంది.డబ్బు, ఉద్యోగం,సామాజిక స్థానం ఒక్కసారిగా మాయం కావచ్చు.కానీ, మనల్ని నిలబెట్టే శక్తి మన శరీరం లో కాదు.మన చుట్టూ ఉన్నవారిలో,మన వైఫ ల్యాల్లో,మన సంకల్పంలో ఉంటుంది.

(ఇది ఓ వీడియో క్లిప్ ఆధారంగా రాయబడిన కథనం)

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి