ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆరో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 164 మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు ప్రకటన విడుదల చేస్తూ అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎంట్రన్స్ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు హాస్టల్ వసతి కూడా అందిస్తారు.
అర్హతలు ఇవే
- బీసీ, ఓసీ విద్యార్థులు: 2014 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జననం
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు: 2012 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జననం
- సంబంధిత జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో వరుసగా రెండేళ్లు చదివి ఉండాలి
- ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివి ప్రమోషన్ పొందాలి
దరఖాస్తు విధానం
- www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in వెబ్‌సైట్లలో దరఖాస్తు చేయాలి
- ముందుగా పరీక్ష ఫీజు చెల్లించి జర్నల్ నెంబర్ పొందాలి
- ఆ జర్నల్ నెంబర్‌తో ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేయాలి
దరఖాస్తు ఫీజు:
- ఓసీ, బీసీ విద్యార్థులు – రూ.200
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు – రూ.150
ప్రవేశ పరీక్ష వివరాలు
- పరీక్ష భాషలు: ఇంగ్లీష్, తెలుగు
- మొత్తం ప్రశ్నలు: 100
- మొత్తం మార్కులు: 100
- సబ్జెక్టులు: మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, తెలుగు, సాంఘికం
- పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు
మోడల్ స్కూల్ ఉన్న మండలంలోనే పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ముఖ్య తేదీలు
- ఫిబ్రవరి 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- మార్చి 31 వరకు అప్లికేషన్ గడువు
- ఏప్రిల్ 12 – ప్రవేశ పరీక్ష
- ఏప్రిల్ 27 – మెరిట్ లిస్ట్ విడుదల
- ఏప్రిల్ 30 – సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్
- జూన్ నుంచి తరగతుల ప్రారంభం
విద్యార్థులు తమ నివాస మండలంలోని మోడల్ స్కూల్‌లోనే అడ్మిషన్ పొందాలి. ఉచిత విద్యతో పాటు హాస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.



