అరటిపండ్లు శరీరానికి కావాల్సిన శక్తిని, పోషకాలను అందించే ఉత్తమమైన పండ్లలో ఒకటి. ముఖ్యంగా మగవాళ్లలో చాలామంది ఉదయం జిమ్ నుంచి వచ్చిన తర్వాత అరటిపండ్లు లేదా బనానా షేక్ తీసుకోవడం సాధారణంగా చూస్తుంటాం. అయితే ఏది మంచిదన్న సందేహం చాలామందిలో ఉంటుంది.
నిపుణుల ప్రకారం అరటిపండును ఎలా తీసుకున్నా శక్తి లభిస్తుంది. కానీ జీర్ణ సమస్యలు ఉన్నవారు అరటిపండును నేరుగా తినడమే మంచిదని చెబుతున్నారు. పేగులకు ఇబ్బంది లేకుండా సులభంగా జీర్ణమవుతుంది.
జిమ్‌కు వెళ్లే వారు, కండరాల బలానికి ఎక్కువ పోషకాలు కావాలనుకునేవారు బనానా షేక్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. పాలతో కలిపి తీసుకుంటే ప్రోటీన్, ఎనర్జీ రెండూ లభిస్తాయి. అలాగే పని ఒత్తిడి, అలసట తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
అయితే సైనస్, జలుబు వంటి సమస్యలు ఉన్నవారు బనానా షేక్‌ను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు. అలాంటి సమయంలో అరటిపండును నేరుగా తినడం సురక్షితం.



