నా ఫ్యామిలీని తిట్టారు.. విడాకుల సమయంలో చాలా ఏడ్చాను: నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్‌గా, ఆ తర్వాత నిర్మాతగా మారి సక్సెస్ సాధించింది. కమిటీ కుర్రాళ్లు సినిమాతో నిర్మాతగా మంచి హిట్ అందుకుంది.

నిహారిక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల విషయం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. చైతన్య జొన్నలగడ్డతో పెద్దలు కుదిర్చిన పెళ్లి అనంతరం మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఈ సమయంలో తనపై, తన కుటుంబంపై తీవ్ర విమర్శలు వచ్చాయని నిహారిక వెల్లడించింది.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నా క్యారెక్టర్‌ను తప్పుగా మాట్లాడారు. నా ఫ్యామిలీని కూడా తిట్టారు. ఆ సమయంలో నేను చాలా ఏడ్చాను. పెళ్లి అనేది చిన్న విషయం కాదు. ఎవ్వరూ కావాలనే విడిపోవాలని అనుకోరు” అంటూ తన బాధను పంచుకుంది.

విడాకుల తర్వాత కుటుంబమే తనకు బలమని, ముఖ్యంగా తండ్రి నాగబాబు అండగా నిలిచారని నిహారిక భావోద్వేగంగా చెప్పింది. ఈ అనుభవం తనకు జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్పిందని పేర్కొంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి