చెన్నైలో కుటుంబ వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్.. రాజకీయ, సినీ ప్రముఖుల సందడి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెన్నైలో జరిగిన కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్నారు. తన పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి మనవడు సాహిల్ వివాహానికి భార్య భారతి తో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. జగన్ చెన్నై రాకతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరడంతో లీలా ప్యాలెస్ పరిసరాలు సందడిగా మారాయి.

ఈ వేడుకలో తమిళనాడు సీఎం స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర రాజకీయ నేతలు పాల్గొన్నారు. అలాగే కోలీవుడ్ అగ్ర హీరోలు విజయ్, సూర్య, కార్తీ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జగన్‌తో వారు కొద్దిసేపు స్నేహపూర్వకంగా ముచ్చటించడంతో ఈ వివాహ వేడుక హాట్‌టాపిక్‌గా మారింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి