ప్రస్తుత జెన్-జి తరం కొరియన్ సినిమాలు, K-డ్రామాలు, K-Pop సంగీతం, ఆన్‌లైన్ గేమ్స్‌కు విపరీతంగా ఆకర్షితులవుతోంది. ఈ డిజిటల్ వ్యసనం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతోంది. తాజాగా ఘజియాబాద్‌లో జరిగిన త్రిబుల్ సూసైడ్ ఘటన ఈ సమస్య తీవ్రతను దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు, తండ్రి సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలచివేసింది. పిల్లలు కొరియన్ డ్రామాలు, K-Pop తమ జీవితం అంటూ డైరీలో రాసి ఉండటం తల్లిదండ్రులను మరింత కలవరపరిచింది.
1997–2012 మధ్య పుట్టిన జెన్-జి యువత సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్, టాస్క్-బేస్డ్ గేమ్స్‌లో ఎక్కువగా మునిగిపోతున్నారు. ఈ ప్రపంచం నుంచి బయటకు రాగానే ఒంటరితన భావన పెరిగి ప్రమాదకర నిర్ణయాలకు దారి తీస్తోందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, వారి ఆన్‌లైన్ అలవాట్లను గమనించడం, భావోద్వేగ సహాయం అందించడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే జెన్-జి తరం ఎదుర్కొనే మానసిక సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.



