బతికుండగానే బిడ్డకు కర్మకాండలు.. చిత్తూరులో కలచివేసిన తల్లిదండ్రుల కఠిన నిర్ణయం

కన్న ప్రేమ కఠినంగా మారిన ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ప్రాణం కంటే మిన్నగా పెంచిన బిడ్డ తమ మాట వినకుండా ప్రేమ వివాహం చేసుకుందని ఆ తల్లిదండ్రులు తీవ్రంగా మనస్తాపం చెందారు. లోకం దృష్టిలో ఆ అమ్మాయి బతికే ఉన్నా, తమ పాలిట మాత్రం ఆమె చనిపోయిందంటూ బతికుండగానే కర్మకాండలు నిర్వహించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది.


చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలంలో ఘటన

ఈ సంఘటన చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఉషా – సుబ్రహ్మణ్యం రెడ్డి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

  • పెద్ద కూతురు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది
  • చిన్న కూతురు హేమప్రియ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది

హేమప్రియ అదే గ్రామానికి చెందిన కిషోర్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉంది.


ప్రేమకు అడ్డుపడ్డ కుటుంబ పరిస్థితులు

ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారే అయినప్పటికీ,
  చదువు పూర్తికాకుండానే పెళ్లి చేసుకోవడం
  అక్క పెళ్లి కాకముందే చెల్లి ప్రేమ వ్యవహారం నడపడం

వంటి విషయాలు తల్లిదండ్రులకు నచ్చలేదు. ఈ కారణంగా హేమప్రియను పెళ్లి విషయమై తీవ్రంగా హెచ్చరించారు.


కాణిపాకంలో వివాహం

తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో హేమప్రియ ఈ నెల 4వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఆమె తన ప్రియుడు కిషోర్‌తో కలిసి కాణిపాకం ఆలయంలో వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం ఆమె ఇంటికి తిరిగి రాలేదు.


బతికుండగానే అంత్యక్రియలు

కూతురు తమ మాట కాదని వెళ్లిపోయిందని భావించిన తల్లిదండ్రులు తీవ్రంగా కలత చెందారు.
“మా కూతురు ఇక మా పాలిట చనిపోయింది” అంటూ
  గ్రామస్తుల సమక్షంలో హేమప్రియ ఫోటో పెట్టి
  శాస్త్రోక్తంగా అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించారు

బంధుమిత్రులను పిలిచి కర్మ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. మా మాట వినకుండా వెళ్లిపోయిన బిడ్డతో ఇక ఎలాంటి సంబంధం లేదంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు.


గ్రామస్తుల సూచనలను పట్టించుకోని తల్లిదండ్రులు

బతికున్న బిడ్డకు కర్మక్రియలు చేయడం సరైంది కాదని గ్రామస్తులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ తల్లిదండ్రులు మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ ఘటన గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి