AI Education: తెలుగు రాష్ట్రాల్లో జియో ఉచిత AI శిక్షణ.. డైరెక్ట్ లింక్ ఇదే

విద్యా రంగంలో డిజిటల్ విప్లవానికి రిలయన్స్ జియో శ్రీకారం చుట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులు–ఉపాధ్యాయులకు ఉచిత AI శిక్షణ అందిస్తూ ‘AI ఎడ్యుకేషన్’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తోంది. ఈ చొరవ ద్వారా ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

గూగుల్ జెమిని ప్రోతో ఆధునిక శిక్షణ

ఈ కార్యక్రమంలో Google Gemini Pro ఆధారిత ఆచరణాత్మక శిక్షణ అందిస్తున్నారు. నోట్స్ తయారీ, అసైన్‌మెంట్లు, కోడింగ్ ప్రాజెక్టులు, గ్రాఫిక్ డిజైన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వంటి అంశాల్లో AIను ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు నేర్పిస్తున్నారు.

ఇప్పటికే వేల పాఠశాలలకు విస్తరణ

ఈ జియో ప్రచారం ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో

  • 2200+ పాఠశాలలకు చేరుకుంది
  • 27,000+ మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు శిక్షణ పొందుతున్నారు
  • ఏపీలో 1500 పాఠశాలలు, తెలంగాణలో 700 పాఠశాలలు పాల్గొంటున్నాయి

రూ.35,100 విలువైన Gemini Pro ఉచితం

జియో అన్‌లిమిటెడ్ 5G వినియోగదారులకు రూ.35,100 విలువైన Google Gemini Pro ప్లాన్‌ను 18 నెలలు ఉచితంగా అందిస్తోంది.

  • Gemini 3 Pro మోడల్
  • AI ఇమేజ్, వీడియో టూల్స్
  • NotebookLM
  • 2TB క్లౌడ్ స్టోరేజ్
      ఇవన్నీ MyJio యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.

Jio AI Classroom – ఉచిత సర్టిఫికేషన్

ఇంకా, జియో ‘Jio AI Classroom’ పేరుతో 4 వారాల ఉచిత ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సును ప్రారంభించింది.

  • తెలంగాణ, ఏపీ విద్యార్థులకు అవకాశం
  • ల్యాప్‌టాప్ / డెస్క్‌టాప్ ద్వారా నేర్చుకోవచ్చు
  • డైరెక్ట్ లింక్: Jio.com/ai-classroom

ఈ కార్యక్రమం ద్వారా యువతను భవిష్యత్ డిజిటల్ ప్రపంచానికి సిద్ధం చేయడంలో జియో కీలక పాత్ర పోషిస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి