భారత్–పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. అలాంటిది ఒకే రోజున రెండు ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌లు జరగబోతుండటం ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌లా మారింది. వచ్చే నెల ఫిబ్రవరి 15న పురుషుల టీ20 వరల్డ్‌కప్‌తో పాటు మహిళల ఆసియా కప్‌లోనూ భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
మహిళల ఆసియా కప్‌లో ఇండియా vs పాకిస్తాన్
ఆసియా క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 షెడ్యూల్ ప్రకారం, ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 13 నుంచి 22 వరకు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతుంది. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.
- ఫిబ్రవరి 15
- ఇండియా vs పాకిస్తాన్
- సమయం: మధ్యాహ్నం 2 గంటలకు (IST)
- వేదిక: బ్యాంకాక్
అదే రోజున పురుషుల టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్
మహిళల మ్యాచ్ ముగిసిన తర్వాత, అదే రోజు సాయంత్రం పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడతాయి.
- సమయం: సాయంత్రం 7 గంటలకు
- వేదిక: కొలంబో, శ్రీలంక
అంటే ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 9 గంటల పాటు నాన్‌స్టాప్ ఇండియా vs పాకిస్తాన్ క్రికెట్ యాక్షన్ అభిమానులకు అందుబాటులో ఉంటుంది.



