Hyderabad: నగరంలోని ఈ ప్రాంతాల్లో నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్ నగరంలో నేడు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. సింగూరు ప్రాజెక్టు ఫేజ్–3 మెయిన్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీలను సరిచేయడానికి జలమండలి అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టనుంది. ఇదే సమయంలో టీఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో విద్యుత్ సాధారణ నిర్వహణ పనులు కూడా జరగనున్నాయి.

జలమండలి అధికారుల ప్రకారం, ఈ మరమ్మత్తు పనులు జనవరి 17 శనివారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ కారణంగా దాదాపు 12 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచే అవకాశం ఉంది. పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

నీటి సరఫరా నిలిచే ప్రాంతాలు ఇవే..

డివిజన్–6:
బంజారాహిల్స్, సోమాజిగూడ, వెంకటగిరి, యల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ, ఎస్పీఆర్ హిల్స్ తదితర ప్రాంతాలు.

డివిజన్–9:
కేపీహెచ్‌బీ, బోరబండ, గాయత్రి నగర్, మూసాపేట్, భారత నగర్.

డివిజన్–15:
కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్.

డివిజన్–17:
గోపాల్ నగర్.

డివిజన్–22:
తెల్లాపూర్.

ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకుని, అవసరమైనంత మాత్రమే వినియోగించుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో జలమండలి కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని సూచించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి