ధనుష్ – మృణాల్ ఠాకూర్ పెళ్లి టాక్.. ఫిబ్రవరి 14న వివాహమా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా, కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14న ధనుష్ – మృణాల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇంతకుముందు కూడా ధనుష్, మృణాల్ మధ్య రిలేషన్‌షిప్ ఉందని వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఈ గాసిప్స్‌ను మృణాల్ ఠాకూర్ ఖండించారు. తాజా ప్రచారంపై ఇప్పటివరకు ధనుష్ గానీ, మృణాల్ గానీ అధికారికంగా స్పందించలేదు. దీనితో ఈ వార్తలు నిజమా? కేవలం రూమర్స్ మాత్రమేనా? అనే ఆసక్తి సినీ అభిమానుల్లో పెరుగుతోంది.

ఇటీవల మృణాల్ పాల్గొన్న కొన్ని సినిమా ఈవెంట్స్‌కు ధనుష్ హాజరవడం, అలాగే ధనుష్ సోదరీమణులను మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవడం వంటి విషయాలు ఈ ప్రేమ వార్తలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఈ కారణాలతోనే వీరిద్దరి పెళ్లి వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఇక ధనుష్ విషయానికి వస్తే.. ఆయనకు ఇదివరకే వివాహం జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను 2004లో ధనుష్ వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా 2024లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. విడాకుల తర్వాత ధనుష్ తన కెరీర్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.

ఇటీవల తెలుగులో ‘కుబేర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

మరోవైపు మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ ద్వారా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మృణాల్, తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఇప్పటివరకు తెలుగులో నాలుగు సినిమాల్లో నటించిన ఆమె, ప్రస్తుతం అడవి శేష్ సరసన ‘డెకాయిట్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మొత్తానికి ధనుష్ – మృణాల్ పెళ్లి వార్తలపై అధికారిక ప్రకటన రాకపోవడంతో, ఇవి నిజమా లేక గాసిప్స్ మాత్రమేనా అన్నది తేలాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఈ విషయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి