స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 996 ఉద్యోగాలు, డిసెంబర్ 23 వరకు అప్లై

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో మొత్తం 996 పోస్టులు ఉండగా, అభ్యర్థులను పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసుకోనున్నట్లు వెల్లడించింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

డిసెంబర్ 2, 2025 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 23, 2025 లోపు అప్లై చేయాలి.


ఖాళీ పోస్టుల వివరాలు

  • విజి ప్రెసిడెంట్ వెల్త్ (SRM): 506
  • అసిస్టెంట్ విపి వెల్త్ (RM): 206
  • కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్: 284

అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో పాటు అనుభవం కూడా ఉండాలి.


వయోపరిమితి

2025 మే 1 నాటికి:

  • కనిష్టం: 20 ఏళ్లు
  • గరిష్ఠం: 42 ఏళ్లు (పోస్టు ఆధారంగా మారుతుంది)

రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపులు:

  • OBC: 3 ఏళ్లు
  • SC, ST: 5 ఏళ్లు
  • PwBD: 10 ఏళ్లు

దరఖాస్తు ఫీజు

వర్గం ఫీజు జనరల్, OBC, EWS రూ.750 SC, ST, PwBD ఫీజు లేదు


ఎంపిక విధానం

  • రాత పరీక్ష లేదు
  • ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

దరఖాస్తు చేసుకోవలసిన వారు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి