అనంతపురం రామగిరి బంగారు నేల కథ

అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతం బంగారం నిక్షేపాలకు ప్రసిద్ధి. ఒకప్పుడు ఇక్కడ గనుల్లో బంగారం తవ్వకాలు జరిగేవి. అయితే అప్పటి తక్కువ బంగారం ధరలు, అధిక ఖర్చులు కారణంగా ఆ కార్యకలాపాలు నిలిచిపోయాయి. గనులను మూసివేశారు.

70 కుటుంబాలకు బంగారం వేటే ఉపాధి

ఇప్పుడు అదే బంగారం మళ్లీ అక్కడి ప్రజలకి ఆర్థిక ఆధారం అవుతోంది. రామగిరిలో సుమారు 70 కుటుంబాలు రోజువారీగా మట్టి తవ్వి, అందులో బంగారం కోసం వెతుకుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సారువలు, టబ్బుల్లో మట్టిని శుద్ధి చేసి, అందులో కనిపించే నల్లని ముక్కలలోనున్న బంగారాన్ని పాదరసం సాయంతో వేరు చేస్తున్నారు. ఇలా తీసే చిన్న చిన్న బంగారు ముక్కలు సమీప పట్టణమైన ధర్మవరంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా మంచి రేటుకే అమ్ముడవుతున్నాయి.

స్థానికులకు ఇది ఏకైక ఉపాధి మార్గంగా మారింది. అందుకే ప్రతిరోజూ బంగారం కోసం తవ్వకం కొనసాగుతోంది.

మళ్లీ తవ్వకాలపై ఆసక్తి పెరుగుతోంది

రామగిరి మండల కేంద్రంలోనే సుమారు 130 హెక్టార్లలో బంగారం గనులు ఉన్నట్లు చెబుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరకు BGM సంస్థ ఇక్కడ తవ్వకాలు నిర్వహించింది. కానీ ఆపేయాల్సి వచ్చింది.

ఇప్పుడు బంగారం ధర భారీగా పెరగడంతో, మళ్లీ ఇక్కడ ఎంత బంగారం నిల్వలున్నాయి? తిరిగి తవ్వకాలు ప్రారంభిస్తే లాభదాయకమా? అనే ప్రశ్నలపై చర్చ మొదలైంది. అధికారులు కూడా ఆసక్తి చూపుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం, ఇక్కడ మట్టిలో టన్నుకు 2 నుంచి 3 గ్రాముల బంగారం దొరికే అవకాశం ఉంది. భూమి లోతుల్లో ఇంకా పుష్కలంగా బంగారం ఉండొచ్చని అభిప్రాయం.

ఎన్‌ఎండీసీ తదుపరి అధ్యయనాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. తిరిగి గనులు తెరవబడితే, స్థానికులకు ఇంకా పెద్ద స్థాయి ఉపాధి అవకాశాలు రావొచ్చు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి