ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 10వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజుకు రెండు విడతల్లో టెట్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.
ఇన్సర్వీస్ టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి చేసిన సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఈసారి దరఖాస్తులు భారీగా పెరిగాయి. మొత్తం 2.71 లక్షల దరఖాస్తులు రావగా, అందులో 32,016 మంది ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. హాల్ టికెట్లు త్వరలో వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి.
ఎందుకు ఇన్సర్వీస్ టీచర్లు టెట్ రాయాలి?
- సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు
- రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలి
- పదవీ విరమణకు ఐదేళ్లకు మించి సర్వీసు ఉన్నవారు తప్పనిసరి
త్వరలో డీఎస్సీ కూడా
ఈ ఏడాది పెద్దఎత్తున పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం, వచ్చే ఏడాది మరో 2000 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రణాళిక వేస్తోంది. దీనితో టెట్ రాయకుండా ఉండాలనుకున్నవారూ ఇప్పుడు పరీక్షకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఏపీ విద్యార్థులు, ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు – అందరికీ టెట్ అత్యంత కీలకం కానుంది.



