బరువు తగ్గాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ డైట్ కట్టుకట్టు చేస్తామంటే కుదరదు, వ్యాయామం మొదలెడదామంటే ఆ క్రమం కొనసాగదు. అలాంటి వారు “వ్యాయామం లేకుండా బరువు తగ్గే మార్గాలు” అంటూ వెతుకుతూ ఉంటారు. నిజానికి కొన్ని ఆహారపు అలవాట్లు, నిద్ర పద్ధతులు, నీటి సేవనం వంటి సాధారణ మార్పులతోనే శరీరం కొద్దికొద్దిగా స్పందిస్తుంది. అదే క్రమం పాటిస్తే ఫలితాలు కనిపిస్తాయి. ఆ ముఖ్యమైన చిట్కాలు ఏమిటో చూద్దాం.
వ్యాయామం చేయకున్నా బరువు తగ్గాలంటే…
వ్యాయామం చేయలేనివారైనా, క్రమబద్ధమైన జీవనం మాత్రం తప్పనిసరి.
- ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేవడం
- రాత్రి సమయానికి నిద్రపోవడం
ఈ రెండు అలవాట్లు శరీర హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. రాత్రి నిద్రపోవడం సరిగా లేకపోతే ఆకలి పెరగడం, తరచుగా తినాలనిపించడం జరుగుతాయి. కాబట్టి మంచి నిద్ర బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోవాలి.
ఆహారం విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు
బరువు తగ్గడం కోసం ఆహారపు అలవాట్లు అత్యంత ముఖ్యమైనవి.
- ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
- త్వరపడకుండా, బాగా నమిలి తినాలి.
- “ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం?” అని జాగ్రత్తగా గమనిస్తూ తినాలి.
- కూల్ డ్రింక్స్, ఐస్క్రీమ్స్, స్వీట్స్ వంటి చక్కెరపదార్థాలకు దూరంగా ఉండాలి.
ఇవన్నీ రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించి ఆకలి తగ్గిస్తాయి.
నీళ్లు – బరువు తగ్గించే సులభ మార్గం
శరీరం మెటబాలిజం వేగం పెరగడానికి నీళ్లు ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు.
- భోజనం ముందు అరగంటకు ముందే ఒక గ్లాస్ నీరు తాగాలి.
- ఇది ఆకలిని తగ్గిస్తుంది.
- ఆహారం తినే పరిమాణం కూడా స్వయంగా తగ్గిపోతుంది.
రోజంతా క్రమం తప్పకుండా నీళ్లు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగే ప్రక్రియ కొంచెం వేగవంతమవుతుంది.
వ్యాయామం చేయకపోయినా ఈ మూడు విషయాలను క్రమంగా పాటిస్తే బరువు తగ్గడంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఇది మందులు లేకుండా, ఖరీదైన మార్గాలు ఆశ్రయించకుండా ఆరోగ్యంగా బరువు తగ్గించే సహజ పద్ధతి.



