10వ తరగతి పరీక్షల షెడ్యూల్ 2026 – AP విద్యార్థుల పూర్తి గైడ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభం అవుతాయి.

పరీక్షల షెడ్యూల్ (తేదీ, రోజు, సబ్జెక్ట్, మార్కులు, సమయం):

  • మార్చి 16, సోమవారం – ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-A), 100 మార్కులు, 09:30 AM – 12:45 PM
  • మార్చి 18, బుధవారం – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కాంపోజిట్ కోర్స్), 70 మార్కులు, 09:30 AM – 12:45 PM
  • మార్చి 20, శుక్రవారం – సెకండ్ లాంగ్వేజ్, 100 మార్కులు, 09:30 AM – 12:45 PM
  • మార్చి 23, సోమవారం – ఇంగ్లీష్, 100 మార్కులు, 09:30 AM – 12:45 PM
  • మార్చి 25, బుధవారం – గణితం, 100 మార్కులు, 09:30 AM – 12:45 PM
  • మార్చి 28, శనివారం – ఫిజికల్ సైన్స్, 50 మార్కులు, 09:30 AM – 11:30 AM
  • మార్చి 30, సోమవారం – బయాలజికల్ సైన్స్, 50 మార్కులు, 09:30 AM – 11:30 AM
  • మార్చి 31, మంగళవారం – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II (కాంపోజిట్ కోర్స్), 30 మార్కులు, 09:30 AM – 11:15 AM
  • ఏప్రిల్ 1, బుధవారం – సోషల్ స్టడీస్, 100 మార్కులు, 09:30 AM – 12:45 PM

OSSC & Vocational Subjects (స్కూల్-వైజ్):

  • OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I (సంస్కృతం/అరబిక్/పర్షియన్), 100 మార్కులు, 09:30 AM – 12:45 PM
  • OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II, 100 మార్కులు, 09:30 AM – 12:45 PM
  • SSC వొకేషనల్ కోర్స్ (థియరీ), 40 మార్కులు, 09:30 AM – 11:30 AM

విద్యాశాఖ అధికారులు విద్యార్థులు సమయానికి సిద్ధంగా ఉండాలని, తప్పుగా కాంబినేషన్ పేపర్లు రాసినట్లయితే బాధ్యత విద్యార్థులదే అని స్పష్టం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి