వాము నీరు తాగడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

వాము గింజలు కేవలం వంటలకు రుచిని, సువాసనను అందించడానికే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. వామును నీటిలో నానబెట్టి లేదా మరిగించి తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

వాము నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని సహజ ఎంజైమ్‌లు జీర్ణవ్యవస్థను ప్రేరేపించి, కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, త్రెన్పులు వంటి సమస్యలను తగ్గిస్తాయి. పిల్లలు, పెద్దలు ఎదుర్కొనే సాధారణ జీర్ణ సమస్యలకు వాము నీరు ఒక సహజ చికిత్సగా పరిగణించబడుతుంది.

అదేవిధంగా, ఇది పేగుల కదలికను మెరుగుపరచి, మల విసర్జనను సులభతరం చేస్తుంది. వాము నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు (మెటబాలిజం) పెరుగుతుంది, దాంతో కొవ్వు కరిగి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వాములో ఉన్న థైమోల్ అనే రసాయన సమ్మేళనం యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉండి, సూక్ష్మజీవులను నిరోధిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది.

వాము నీరు తీసుకోవడం వలన జలుబు, దగ్గు, గొంతునొప్పి, కఫం వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పిని తగ్గించడంలో కూడా ఇది ఎంతో ఉపయోగకరం. కొందరిలో పీరియడ్స్ సైకిల్‌ను సవ్యంగా ఉంచడంలో కూడా వాము సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలు ఇస్తున్న తల్లులలో పాల ఉత్పత్తిని పెంచడానికి వామును సాంప్రదాయకంగా ఉపయోగిస్తారు.

అంతేకాక, వాము నీరు శరీరంలోని విష పదార్థాలను, మలినాలను మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపించి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా వాము సహాయపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి