ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త అందింది. ఉల్లి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో హెక్టారుకు రూ.50 వేల చొప్పున సహాయం అందించనుంది. ఫలితంగా కర్నూలు, కడప జిల్లాల్లోని 20,913 మంది రైతులకు రూ.104.57 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
ఈ ఆర్థిక సహాయం ఈ-పంట ఆధారంగా అందజేయబడనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో ఉల్లి పండించిన రైతులకు నేరుగా ప్రయోజనం లభించనుంది.
ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం.. వారిని రక్షించేందుకు ముందుకు వచ్చింది. మార్కెటింగ్ శాఖ, మార్క్‌ఫెడ్ ఇప్పటికే కీలక పాత్ర పోషించాయి. క్వింటాల్ ఉల్లిని రూ.1,200 చొప్పున కొనుగోలు చేసి, మొత్తం రూ.18 కోట్లు వెచ్చించాయి. వీటిలో రూ.10 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించగా, మిగతా రూ.8 కోట్లు కూడా త్వరలో అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ఈసారి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఉల్లి ధరలు క్వింటాకు రూ.600 కంటే ఎక్కువగా లభించలేదు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్వింటాకు రూ.1,200 చొప్పున సుమారు 1.39 లక్షల క్వింటాళ్ల ఉల్లిని సేకరించింది. కర్నూలు మార్కెట్ యార్డ్‌లోకి వచ్చిన ఉల్లిని మొత్తం సేకరించి, కొంతమందికి రైతు బజార్లు, వ్యాపారుల ద్వారా విక్రయించే అవకాశం కల్పించింది.
అయినా కొంతమంది రైతుల వద్ద ఉల్లి నిల్వలుగా మిగిలినట్లు గుర్తించిన ప్రభుత్వం.. ఆ రైతుల నష్టాలను సమీక్షించి హెక్టారుకు రూ.50 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
దీనికి సంబంధించిన నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లో సాయం నేరుగా జమ కానుంది. ఈ చర్యతో రైతులు కొంత ఊరట పొందనున్నారు.
- AP 10వ తరగతి హాల్ టికెట్లు 2026 విడుదల – పూర్తి టైమ్‌టేబుల్ వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో 2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పరీక్షల పూర్తి టైమ్‌టేబుల్, హాల్ టికెట్ డౌన్లోడ్ విధానం, ముఖ్య సూచనలు తెలుసుకోండి.
- రైల్వే Group – D 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు – మార్చి 9 వరకు అవకాశం
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించిన 22,195 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు మార్చి 9, 2026 వరకు పొడిగించారు. అర్హతలు, ఫీజు వివరాలు, ముఖ్యమైన తేదీలు, సౌత్ సెంట్రల్ రైల్వేలో ఖాళీల వివరాలు తెలుసుకోండి.
- సీనియర్ జర్నలిస్ట్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
గుంటూరు జిల్లా మంగళగిరిలో సీనియర్ జర్నలిస్ట్ చందు రామకృష్ణ (ఆర్కే నాయుడు)పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పూర్తి వివరాలు చదవండి.
- Tirumala: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. మార్చి 2, 3న SSD టోకెన్లు, VIP దర్శనాలు రద్దు – TTD ప్రకటన
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న తిరుమల ఆలయం 10 గంటల పాటు మూసివేత. SSD టోకెన్లు, VIP దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు TTD ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
- Ration Cards: ఎప్పుడైనా అప్లై చేసుకోండి.. నిరంతర జారీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం. పూర్తి వివరాలు చదవండి.



