సముద్రంలో మునిగిన 5 లక్షల ఐఫోన్‌ 17లు! రూ.4,000 కోట్ల నష్టం – పెరూలో షాకింగ్‌ ఘటన

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అంటే ఉండే క్రేజ్ వేరు. ఎన్ని కొత్త బ్రాండ్లు, ఎన్ని ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లు వచ్చినా ఐఫోన్‌ ఫ్యాన్‌ బేస్‌ మాత్రం తగ్గదు. తాజాగా విడుదలైన ఐఫోన్‌ 17 సిరీస్‌ (2025 సెప్టెంబర్‌) భారత్‌లో రూ.50 వేల నుంచి ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. కానీ ఈ సిరీస్‌పై దక్షిణ అమెరికాలోని పెరూలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే — పెరూ తీరంలో ఓ భారీ నౌక ప్రమాదం జరిగింది. ప్రపంచ ప్రసిద్ధ నౌకాయాన సంస్థ **ఎవర్‌ గ్రీన్‌ (Evergreen)**కు చెందిన కార్గో నౌక చైనాలోని షెన్‌జెన్‌ పోర్టు నుంచి లాస్‌ ఏంజెల్స్‌ వైపు ప్రయాణిస్తుండగా, మధ్యలో బలమైన గాలులు, సముద్ర అలల ధాటికి సమతుల్యం కోల్పోయి ప్రమాదానికి గురైంది. ఫలితంగా దాదాపు 50 కంటైనర్లు పసిఫిక్‌ సముద్రంలో మునిగిపోయాయి.

సంచలనమైన విషయం ఏమిటంటే — ఆ కంటైనర్లలో దాదాపు 5 లక్షల ఐఫోన్‌ 17 యూనిట్లు ఉన్నాయని సమాచారం. అంచనా ప్రకారం ఈ ఫోన్ల విలువ రూ. 4,000 కోట్లకు పైగా ఉంటుందని నౌకాయాన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు. అయినా ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్‌ అవుతోంది.

వీడియోలు, మీమ్స్, కామెంట్లతో నెటిజన్లు తెగ సందడి చేస్తున్నారు.
ఎవరైనా సరదాగా – “నేచర్ ఈజ్ కాలింగ్… వాటర్‌ప్రూఫ్ ఫోన్‌ కదా, వెళ్తా తీసుకువస్తా” అంటుండగా, మరికొందరు “ఐఫోన్‌ కాదు, ఐ గాన్‌!” అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు “లొకేషన్‌ చెప్పు బ్రో, నేను ఈత కొట్టొచ్చు”, “ఈత నేర్చుకోకపోవడం నా పెద్ద తప్పు” అంటూ నవ్వులు పూయిస్తున్నారు.

ఒకవైపు ప్రమాదం, మరోవైపు సోషల్ మీడియాలో ట్రెండింగ్ జోకులు – ఈ ఘటన ఇప్పుడు టెక్‌ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సమాచారం నిజమా కాదా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాకపోయినా, “సముద్రంలో మునిగిన 5 లక్షల ఐఫోన్‌లు” అన్న హెడ్లైన్ మాత్రం ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి