శివ’ రీ-రిలీజు సందడి: “రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి” అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫన్నీ కాల్

తెలుగు సినీ చరిత్రలో సరికొత్త దిశను చూపిన ట్రెండ్‌సెట్టర్ చిత్రం ‘శివ’ మరోసారి తెరపైకి రానుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో 1989లో విడుదలైన ఈ కల్ట్ క్లాసిక్ 36 ఏళ్ల తర్వాత నవంబర్ 14న రీ-రిలీజ్‌ అవుతోంది. అప్పట్లో సినిమాటిక్ రివల్యూషన్‌కి నాంది పలికిన ఈ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

రీ-రిలీజ్ సందర్భంగా సినీ ప్రముఖులు ‘శివ’తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే దర్శకులు శేఖర్ కమ్ముల, అశుతోష్ గోవారికర్ వీడియో సందేశాలను విడుదల చేశారు. తాజాగా ఈ జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు.

అల్లు అర్జున్ తన ప్రత్యేక వీడియోలో మాట్లాడుతూ— “తెలుగు సినిమా చరిత్రలో ‘శివ’ ఒక ఐకానిక్ సినిమా. ఈ సినిమా వచ్చిన తర్వాత భారతీయ సినిమాల్లోనే అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అలాంటి అద్భుతమైన చిత్రం మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతుంటే, మనం పెద్ద సెలబ్రేషన్ చేసుకోవాలి” అన్నారు.

అదే సమయంలో ‘శివ’ చిత్రంలోని లెజెండరీ డైలాగ్ “రెండులారీల జనం”కు క్రియేటివ్ ట్విస్ట్ ఇస్తూ, “ఈసారి థియేటర్‌కి వెళ్తుంటే ‘రెండు లారీల పేపర్లు’ తీసుకెళ్లండి” అంటూ తనదైన హాస్యశైలిలో అభిమానులకు పిలుపునిచ్చారు.

అల్లు అర్జున్‌ ఈ ఫన్నీ కామెంట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. సినీ ప్రేమికులు ‘శివ’ రీ-రిలీజ్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు సినీ ప్రేక్షకుల హృదయాల్లో గట్టిగా మోగిన ఆ గర్జన మరోసారి థియేటర్లలో మార్మోగేందుకు సమయం దగ్గరపడుతోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి