GATE 2026 పరీక్ష తేదీలు & తెలంగాణలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు

దేశవ్యాప్తంగా ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల కోసం 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2026 పరీక్షల తేదీలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గువహటి అధికారికంగా ప్రకటించింది.

తాజా షెడ్యూల్ ప్రకారం, GATE 2026 ప్రవేశ పరీక్షను 2026 ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ షెడ్యూల్‌ను IIT గువహటి అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తయాయి. పరీక్ష మొత్తం 30 పేపర్లలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడతాయి.

GATE పరీక్షకు బీటెక్ విద్యార్థులే కాక, B.Sc., B.A., B.Com చదువుతున్న విద్యార్థులూ రిజిస్టర్ చేసుకొని పాల్గొనవచ్చు. పరీక్షలో సాధించిన GATE స్కోరు ఫలితాలు వెలువడిన తర్వాత 3 సంవత్సరాలపాటు చెల్లుబాటు అవుతాయి, ఈ స్కోరు ద్వారా విద్యార్థులు ఎంటెక్ మరియు ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. అభ్యర్ధులు గరిష్ఠంగా రెండు పేపర్ల వరకు పరీక్ష రాయవచ్చు.

GATE 2026 పరీక్ష ఫార్మాట్

GATE ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కుల, 65 ప్రశ్నలతో ఉంటుంది మరియు వ్యవధి 3 గంటలు. పరీక్షలో నెగటివ్ మార్కింగ్ విధించబడుతుంది:

  • ప్రతి తప్పు జవాబుకు 33.33% మార్కుల కోత ఉంటుంది.
  • 1 మార్కు ప్రశ్నకు 1/3, 2 మార్కుల ప్రశ్నకు 2/3 కోత విధించబడుతుంది.

GATE 2026 స్కోరు PG కోర్సుల కోసం 3 సంవత్సరాలు, PSUలో నియామకాలకు 2 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. మరిన్ని వివరాలు IIT గువహటి అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.


తెలంగాణలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా జాతీయం జారీ చేశారు.

కొత్త కళాశాలలు ఈ ప్రాంతాల్లో ఏర్పాటుచేయబడతాయి:

  • జగిత్యాల జిల్లా, ధర్మపురి
  • కరీంనగర్ జిల్లా, గంగాధర మండల

ఇప్పటికే ఏ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తారనే విషయంపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి