తెలంగాణలో ఈ సంవత్సరం పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం వచ్చే ఏడాది జరగబోయే ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE Telangana) అధికారికంగా విడుదల చేసింది. ప్రత్యేక పరిస్థితులు తప్పితే, ఈ టైమ్‌టేబుల్ ప్రకారం మార్చి 16, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
బోర్డు విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రతి పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు ముగుస్తుంది. అయితే, సైన్స్ మరియు వొకేషనల్ పరీక్షలకు సమయం ఉదయం 9.30 గంటల నుండి 11.30 గంటల వరకు మాత్రమే ఉంటుంది.
ఎస్సెస్సీ పరీక్షల పూర్తి షెడ్యూల్ 2026
- మార్చి 16, 2026 (సోమవారం) – ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒడియా, కాంపోజిట్ కోర్సు)
- మార్చి 18, 2026 (బుధవారం) – సెకండ్ లాంగ్వేజ్ (హిందీ, తెలుగు, స్పెషల్ ఇంగ్లీష్)
- మార్చి 21, 2026 (శనివారం) – ఇంగ్లీష్
- మార్చి 23, 2026 (సోమవారం) – గణితం (Mathematics)
- మార్చి 25, 2026 (బుధవారం) – ఫిజికల్ సైన్స్ (Physical Science)
- మార్చి 28, 2026 (శనివారం) – బయోలజీ (Biological Science)
- మార్చి 30, 2026 (సోమవారం) – సోషల్ స్టడీస్ (Social Studies)
ఇతర ప్రత్యేక పేపర్లు
- మార్చి 31, 2026 –
▪ కాంపోజిట్ కోర్సు విద్యార్థుల ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
▪ ఓఎస్సెస్సీ విద్యార్థుల మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) - ఏప్రిల్ 1, 2026 –
▪ ఓఎస్సెస్సీ విద్యార్థుల మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
▪ ఎస్సెస్సీ వొకేషనల్ కోర్సు పరీక్షలు
పరీక్షల సమయాలు
- సాధారణ పేపర్లు: ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు
- ఫిజికల్ సైన్స్, బయోలజీ & వొకేషనల్ పేపర్లు: ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 11.30 వరకు
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రంజాన్ మరియు ఉగాది పండుగ తేదీల ఆధారంగా పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in ద్వారా తాజా సమాచారం తెలుసుకోవచ్చు.



