తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సదా. జయం, ఔనన్నా కాదన్నా, దొంగ దొంగది, అపరిచితుడు, నాగ వంటి చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసుకుంది. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా స్టార్ హీరోయిన్ స్థాయిలో గుర్తింపు పొందింది. అయితే తన కెరీర్‌లో ఒక సీన్ కారణంగా తీవ్ర ఆవేదనకు గురై ఇంటికెళ్లి బోరున ఏడ్చేసిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
సదా కన్నీళ్లు పెట్టుకున్న సీన్ ఏమిటి?
సదా నటించిన తొలి తెలుగు చిత్రం జయం. ఇందులో నితిన్ హీరోగా, గోపీచంద్ విలన్‌గా నటించారు. ఈ సినిమాలో గోపీచంద్, సదా మధ్య ఓ సీన్ చిత్రీకరణ సమయంలో సదా తీవ్ర అసౌకర్యంగా ఫీలయ్యిందట. ఆ సీన్‌లో గోపీచంద్, సదా ముఖాన్ని నాలుకతో తాకే సన్నివేశం ఉంది.
మొదట ఈ సీన్ చేయనని సదా నిరాకరించిందట. అయితే సినిమా కోసం ఇది హైలైట్ అవుతుందని దర్శకుడు చెప్పడంతో చేసేదేమి లేక ఒప్పుకుందట. షూటింగ్ పూర్తయ్యాక ఇంటికెళ్లి “నేను ఈ సీన్ ఎందుకు చేశానా బాబోయ్!” అంటూ బోరున ఏడ్చేసిందని, తనకు అది జీవితంలో చెత్త సీన్‌గా అనిపించిందని స్వయంగా చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత ఏమైందంటే…
ఆ సంఘటన తర్వాత సదా తనకు అసౌకర్యంగా అనిపించే సీన్లను ఇకపై ఎప్పటికీ చేయనని నిర్ణయించుకుందట. కెరీర్‌లో అవకాశాలు తగ్గిన తర్వాత, ఆమె కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఇటీవల తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.
రియాలిటీ షోలు, జడ్జింగ్‌లో బిజీ
సినిమాల కంటే ఇప్పుడు సదా రియాలిటీ డాన్స్ షోలు, ఈవెంట్లలో జడ్జ్‌గా ఎక్కువగా కనిపిస్తోంది. తన అనుభవాన్ని కొత్త తరానికి పంచుకుంటూ, ప్రదర్శనలకు హాజరవుతూ సినీ రంగంలో యాక్టివ్‌గా కొనసాగుతోంది.


