కర్నూలు జిల్లా గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులు

విజయవాడ: కర్నూలు జిల్లా గ్రామీణ విలేఖరుల జర్నలిస్టిక్ నైపుణ్యాలను పెంపొందించేందుకు సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో పునశ్చరణ తరగతులు నిర్వహించబడుతున్నాయి. ఈ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం పరిణయ ఫంక్షన్ హాల్, హోటల్ మౌర్య ఇన్‌లో జరగనుందని అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

శనివారం (13.9.2025) ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రారంభ సభ అనంతరం జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతులు జరుగుతాయి.

తొలి రోజు (సెప్టెంబర్ 13) ప్రధానాంశాలు:

  • ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టింగ్
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జర్నలిజంలో వినియోగం
  • క్రైమ్ రిపోర్టింగ్ పద్ధతులు

రెండవ రోజు (సెప్టెంబర్ 14) ప్రధానాంశాలు:

  • గ్రామీణ వార్తల ప్రాధాన్యం, కథనాల రూపకల్పన
  • పత్రికా భాష వినియోగం
  • ఫ్యూచర్ రైటింగ్ శైలి
  • విలేఖరులు – డెస్క్ అనుసంధానం (డెస్క్ ఎం కోరుకుంటుంది)

ఈ అంశాలపై సీనియర్ జర్నలిస్టులు పాల్గొని విలువైన మార్గదర్శకత్వాన్ని అందించనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న విలేఖరులు ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆలపాటి సురేశ్‌కుమార్ పిలుపునిచ్చారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి