ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోను ప్రదర్శించడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కోర్టు బుధవారం తోసిపుచ్చింది.
ఈ పిటిషన్‌లో రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించిన ధర్మాసనం, చట్టపరమైన ఆధారాలు లేకుండా ఇలాంటి పిటిషన్ వేసినందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “ఉప ముఖ్యమంత్రి ఫొటో పెట్టకూడదని చెప్పే నిబంధనలు ఎక్కడ ఉన్నాయి?” అని పిటిషనర్‌ను కోర్టు నేరుగా ప్రశ్నించింది.
దీంతో, ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు ఏర్పాటు చేయడంపై ఎలాంటి అడ్డంకి లేదని స్పష్టం అయ్యింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



