టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని, ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ తర్వాత మళ్లీ తెలుగులో తన సొంత ప్రొడక్షన్ హౌస్ “ట్రాలాలా ప్రొడక్షన్స్” ద్వారా వచ్చిన శుభం సినిమాలో క్యామియో రోల్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఆ సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా, సమంత నిర్మాతగా తీసుకున్న ప్రయత్నం మాత్రం సినీ వర్గాల్లో పాజిటివ్‌గా మాట్లాడించుకుంది.
తాజాగా ఆమె ప్రొడక్షన్ హౌస్ నుంచి మా ఇంటి బంగారం అనే సినిమా రాబోతుందని అనౌన్స్ చేసినా, దాని షూటింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇదిలాఉంటే, సమంత తన బ్యానర్లో మూడో సినిమా మొదలుపెట్టేందుకు రెడీ అవుతోందని సమాచారం.
ఇప్పటికే ఒక కొత్త దర్శకుడు చెప్పిన లైన్‌కి సమంత ఫిదా అయిపోయిందట. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్‌లోకి వస్తుండగా, స్టోరీ లాక్ అయిన వెంటనే కాస్టింగ్ వర్క్ స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.
ఈసారి సినిమా కంప్లీట్ డిఫరెంట్ జోనర్లో, అలాగే లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కనుందని ఫిలింనగర్ బజ్. హీరోయిన్ నిర్మాతగా మారి సినిమాలు చేయడం బాలీవుడ్లో ఎక్కువగా కనిపించే ట్రెండ్. కానీ, సౌత్‌లో, ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయిలో ఉన్న సమంత ఇలా నిర్మాతగా కూడా కొత్త ప్రయత్నాలు చేస్తుండటం ఆమె అభిమానులను ఖుషీ చేస్తోంది.
టాప్ హీరోలందరితో జోడీ కట్టిన సమంత, గతంలో ఖుషిలాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం ఆమెకు ఫిమేల్ సెంట్రిక్ కథలపై ప్రత్యేక దృష్టి ఉంది. కమర్షియల్ సినిమాల్లోనూ చేస్తానని చెప్పినా, అందులో తన పాత్ర తప్పనిసరిగా స్పెషల్‌గా, నెక్స్ట్ లెవెల్‌గా ఉండాలని షరతు పెడుతోందట.
ఇటీవల హెల్త్ ఇష్యూస్ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న సమంత, ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయ్యి మళ్లీ కెరీర్లో బిజీ అవ్వాలని చూస్తోంది. ఒకవైపు సౌత్ సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజ్ & డీకేతో బాలీవుడ్ వెబ్‌సిరీస్ కోసం కూడా డిస్కషన్స్‌లో ఉంది.
క్లియర్‌గా చెప్పాలంటే – హీరోయిన్గా గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సమంత పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. రాబోయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో మళ్లీ బాక్స్ ఆఫీస్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.



