విజయవాడ: ఆగష్టు 30, 31వ తేదీలలో ప్రకాశం జిల్లా గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులు నిర్వహించబడతాయని,ఆంధ్రప్రదేశ్ కి చెందిన సి.ఆర్.మీడియా అకాడమి ఈ తరగతులను నిర్వహిస్తున్నదనీ,ఈ కార్యక్రమాన్ని గ్రామీణ విలేఖరులు సద్వినియోగం చేసుకోవాలని సి. ఆర్. మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పునశ్చరణ తరగతులు ఏర్పాటు గురించి ఛైర్మన్ ఆలపాటి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా, మార్కాపురం నందు గల సౌజన్య ఫంక్షన్ హాల్ వేదికగా ఆగష్టు 30, 31వ తేదీలలో రెండురోజుల పాటు గ్రామీణ విలేకరుల కు ఈ ప్రత్యేక తరగతులు జరుగుతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం శనివారం 30వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది.సభా కార్యక్రమం అనంతరం తరగతులు ప్రారంభం అవుతాయి.2 రోజుల ఈ రెండు రోజుల కార్యక్రమం లో తొలి రోజున క్రైమ్ రిపోర్టింగ్,గ్రామీణ వార్తలు, కధనాలు,ఫ్యాక్ట్ చెక్ అనే అంశాలపైన,తదుపరి 2వ రోజున ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI), పత్రికా భాష,ఎలక్ట్రానిక్ మీడియా కవరేజ్ లో మెళకువలు, నెట్వర్క్ అండ్ కోఆర్డినేషన్ అనే అంశాలపై సీనియర్ జర్నలిస్టులు శిక్షణ ఇస్తారని చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ తెలియ జేశారు.



