అమరావతిపై అబద్ధపు ప్రచారం – భావ ప్రకటన స్వేచ్ఛ అంశంపై విజయవాడలో సెమినార్

విజయవాడ: “అమరావతిపై అబద్ధపు ప్రచారం – భావ ప్రకటన స్వేచ్ఛ” అనే అంశంపై ప్రత్యేక సెమినార్ ఈ నెల 28న విజయవాడలో జరగనుంది. సి ఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గారపాటి కాంప్లెక్స్‌లోని శ్రీరామ ఫంక్షన్ ప్యాలెస్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ మంగళవారం ప్రకటించారు.

అమరావతి రైతులు, పాత్రికేయులు, మేధావులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారని ఆయన తెలిపారు.

సెమినార్‌కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ టి. సునీల్ చౌదరి హాజరుకానున్నారు. అలాగే, సామాజిక కార్యకర్త మరియు నీటిపారుదల నిపుణుడు తుంగా లక్ష్మీనారాయణ, చరిత్రకారుడు పాపినేని సాయి, అమరావతి రైతు జొన్నలగడ్డ కిరణ్ విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరూ భాగస్వామ్యం కావాలని అకాడమీ చైర్మన్ పిలుపునిచ్చారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి