ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన మరోసారి వాయిదా పడింది. విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, అధికారులు దానిని మంగళవారం నుంచి జరపాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే మెరిట్ జాబితాను విడుదల చేసి, అభ్యర్థులకు ర్యాంకులు కేటాయించిన విషయం తెలిసిందే. డీఎస్సీలో సాధించిన స్కోర్‌తో పాటు రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగా ఎంపికైన వారికి ఉద్యోగ నియామక కాల్ లెటర్లు జారీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు చోటుచేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే జాబితాలను ఒకసారి కాకుండా పలు మార్లు సవివరంగా పరిశీలిస్తున్నారు.

విద్యాశాఖ ముందుగా ప్రకటించిన ప్రకారం ఆదివారం రాత్రి నుంచే అభ్యర్థుల లాగిన్‌లో కాల్ లెటర్లు అందుబాటులోకి రావాలి. తరువాత సోమవారం నుంచే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కాల్ లెటర్ల అప్లోడ్‌లో ఆలస్యమవడంతో షెడ్యూల్ మారింది. తాజా నిర్ణయం మేరకు సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్‌లో కాల్ లెటర్లు అందుబాటులో ఉంటాయి. సర్టిఫికెట్ల పరిశీలన మాత్రం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి