మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం మెగా 157పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు చిరంజీవి జన్మదినం సందర్భంగా చిత్రబృందం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ సినిమాకు “మన శంకరవరప్రసాద్ గారు” అనే వినూత్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు. “పండగకి వస్తున్నారు” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ గ్లింప్స్ అభిమానుల్లో ఉత్సాహం రేపింది.
విక్టరీ వెంకటేశ్ ఈ టైటిల్ గ్లింప్స్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వగా, చిరంజీవి ఎంట్రీ స్టైలిష్‌గా, గ్రాండ్‌గా ఉండి అభిమానులను అలరించింది. భిన్నమైన లుక్‌లో మెగాస్టార్ కనిపించడం విశేషం.
ఈ సినిమాలో వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించనుండగా, నయనతార చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.
ఈ మెగా ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.



