“మంచి అబ్బాయిలు ఎందుకు ఎప్పుడూ ‘జస్ట్ ఫ్రెండ్స్’గానే మిగిలిపోతారు?”

ఒక అబ్బాయి–అమ్మాయి మధ్య స్నేహం ఎప్పుడూ ప్రేమలోకి మారుతుందా? అనే ప్రశ్న ఎప్పటినుంచో చర్చనీయాంశమే. చాలా సార్లు “అతను మంచి వాడే కానీ, నా కోసం కేవలం ఫ్రెండ్ మాత్రమే” అనే మాట వింటుంటాం. ఈ వాక్యం అనేకమంది అబ్బాయిల జీవితంలో ఒక బాధగా మిగిలిపోతుంది. సినిమా డైలాగ్‌లా “లడ్కా లడ్కీ కభీ దోస్త్ నహీ హో సక్తే” అని చెప్పడం సులభమే కానీ నిజ జీవితంలో పరిస్థితులు అంత తేలికగా ఉండవు. ముఖ్యంగా నిజాయితీగా, మంచితనంతో ఉండే అబ్బాయిలు ఎందుకు ప్రేమికులుగా కాకుండా ఎప్పటికీ “మంచి స్నేహితులు”గానే మిగిలిపోతారో చూద్దాం.

స్నేహాన్ని కోల్పోతామనే భయం

ప్రధాన కారణం భావాలను దాచిపెట్టడం. “నా ప్రేమను అంగీకరించకపోతే, ఈ స్నేహమే కోల్పోతానేమో?” అన్న భయం వారిని వెంటాడుతుంది. విలువైన స్నేహం పోతుందేమో అన్న ఆందోళనతో మనసులోని మాట బయటకు చెప్పలేరు. కానీ మౌనం ఎప్పటికీ పరిష్కారం కాదు. మాటలతో కాకపోయినా ప్రవర్తనలో చిన్న సంకేతాల ద్వారా మనసులోని భావాలను తెలియజేయవచ్చు.

ఆత్మవిశ్వాసం లోపించడం

మరో అడ్డంకి ఆత్మవిశ్వాసం లేకపోవడం. చాలామంది అబ్బాయిలు “ఆమె దేవతలాంటిది, నేను సరిపోను” లేదా “నా లాంటి వాడిని ఆమె ఎందుకు ప్రేమిస్తుంది?” అనే ఆత్మన్యూనత భావంలో ఉంటారు. ఆకర్షణకు బలమైన పునాది ఆత్మవిశ్వాసమే. మీరు మీను మీరు గౌరవించుకోకపోతే, ఇతరులు కూడా మిమ్మల్ని గౌరవించరు. మీరే ముందే ఓడిపోయినట్లు భావిస్తే, అది నిజం కావడం ఖాయం.

తిరస్కరణ, పరువు భయం

“నా ప్రేమను అంగీకరించకపోతే, అందరి ముందు పరువు పోతుందేమో?” అనే భయం చాలా మందిని వెనక్కి నెడుతుంది. ఈ భయం సహజమే కానీ దీన్ని అధిగమించాల్సిందే. ఓటమిని అంగీకరించడానికి సిద్ధపడిన వాడే నిజమైన విజయాన్ని పొందగలడు. తిరస్కరణను భయపడని వాడే ప్రేమలోనూ ధైర్యంగా ముందుకు సాగుతాడు.

అతిగా అందుబాటులో ఉండటం

అతి మంచితనం కూడా ఒక సమస్యగానే మారుతుంది. మంచి అబ్బాయిలు ఇతరుల సంతోషానికే ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఎప్పుడూ అందుబాటులో ఉండటం, ఏదైనా అడిగితే వెంటనే చేయడం వల్ల మీ విలువ తగ్గుతుంది. కొన్నిసార్లు కొద్దిగా దూరం ఉండటం అవసరం. అప్పుడే మీ లేని లోటు వారికి తెలుస్తుంది. మీపై గౌరవం, ఆరాధన పెరుగుతుంది.

ముగింపు

మంచి అబ్బాయిలు ఎందుకు ప్రేమలో విఫలమవుతారనే ప్రశ్నకు సమాధానం – భయం, ఆత్మవిశ్వాసం లోపం, తిరస్కరణ భయం, అతిగా అందుబాటు. ఇవన్నీ దాటుకుని ధైర్యంగా ముందడుగు వేసినప్పుడే, ప్రేమను నిజమైన అనుభూతిగా మార్చుకోవచ్చు. లేకపోతే, జీవితాంతం “మంచి ఫ్రెండ్” అనే ముద్రే మిగిలిపోతుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి