ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం – ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం

ap-women-free-bus-travel-scheme-launch-august-15

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పేరుతో ఈ పథకాన్ని ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అట్టహాసంగా ప్రారంభించబోతోంది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.

ఎవరికి వర్తిస్తుంది?

  • మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు
  • తగిన గుర్తింపు కార్డు చూపించాలి
  • రాష్ట్రంలో ఎంపిక చేసిన RTC బస్సుల్లో మాత్రమే వర్తింపు

ఏ బస్సుల్లో ఉచితం? (5 కేటగిరీలు)

  1. ఎక్స్‌ప్రెస్ (Express)
  2. మెట్రో ఎక్స్‌ప్రెస్ (Metro Express)
  3. సిటీ ఆర్డినరీ (City Ordinary)
  4. పల్లె వెలుగు (Palle Velugu)
  5. అల్ట్రా పల్లె వెలుగు (Ultra Palle Velugu)

ఏ బస్సుల్లో ఉచితం వర్తించదు?

  • తిరుపతి–తిరుమల సప్తగిరి బస్సులు
  • అంతర్రాష్ట్ర (Interstate) బస్సులు
  • నాన్ స్టాప్ సర్వీసులు
  • సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, స్టార్ లైనర్, AC బస్సులు

భద్రతా చర్యలు

  • అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
  • కండక్టర్లకు బాడీ వోర్న్ కెమెరాలు
Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి