అమరావతి: రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మరోసారి విద్యార్థుల పట్ల తన మక్కువను చాటుకున్నారు. ఉత్తమ విద్యను పొందాలని తపనతో ఉన్న గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలవాలన్న సంకల్పంతో, ఈ ఏడాది నుంచి ఐఐటీల్లో (IITs) సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్వంత నిధులతో ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు.
వర్గాల వారీగా ఆర్థిక సహాయం ఇలా:
- ఎస్టీ విద్యార్థులకు – ₹1,00,000
- ఎస్సీ విద్యార్థులకు – ₹75,000
- బీసీ విద్యార్థులకు – ₹50,000
- ఓసీ విద్యార్థులకు – ₹25,000
ఈ మొత్తాలను వ్యక్తిగతంగా తన స్వంత డబ్బుతో అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల కృషిని గుర్తించడంతో పాటు, మరెన్నోమంది పిల్లలు గోల్‌మెట్‌లాంటి విద్యాసంస్థల్లో చేరేందుకు ప్రేరణ పొందాలని ఆయన ఆశించారు.
విద్యార్థుల పట్ల మంత్రి శ్రద్ధ
పార్టీ, పదవి సంబంధం లేకుండా విద్యార్థుల అభ్యున్నతిని ముందే ఉంచే మంత్రి పార్థసారథి గారు, యువత తమ సమస్యలను తెలపగానే వెంటనే స్పందించి, సంబంధిత అధికారులను పర్యవేక్షిస్తూ పరిష్కారం అయ్యే వరకు పట్టుబడతారు. ఇది నూజివీడు IIITకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఆ విద్యాసంస్థలో అనేక మంది విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది నూజివీడు IIIT పునరుజ్జీవానికి సంకేతమని చెప్పవచ్చు.
మంత్రి మాటల్లోనే…
“విద్యార్థులు పట్టుదలతో చదివి, తమ తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలి. దేశాభివృద్ధిలో భాగస్వాములుగా మారాలి. నా వంతుగా ఈ ప్రోత్సాహక కార్యక్రమం చేపట్టాను.”
ఈ విధంగా గ్రామీణ పశ్చాతంలో నుండి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం చేయడం ద్వారా, మంత్రి పార్థసారథి ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగానికి ఒక కొత్త ఉదాహరణను నెలకొల్పారు.



