ఇబ్రహీంపట్నంలో APWJF మహాసభ- స్థానికంగా “ప్రజాప్రెస్ క్లబ్” ప్రారంభం.

apwjf-mahasabha-ibrahimpatnam-praja-press-club-launch

మైలవరం;ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం లో ఆదివారం ఘనంగా APWJF నియోజకవర్గ మహాసభ ఇబ్రహీంపట్నం లో ఘనంగా జరిగింది.ఈ సభలోమైలవరం నియో జకవర్గం పరిధిలో జర్నలి స్టులు నూతన కార్యవర్గం ని ఎన్నుకున్నారు.ప్రధాన కార్యదర్శిగా వీసం సురేష్ బాబు ఎంపికయ్యారు.

నియోజకవర్గ పరిధి లో ఇబ్రహీంపట్నం ఫెర్రీలో ని స్థానిక ఆర్టీసీ కమ్యూని టీహాల్లో ఆదివారం నిర్వ హించిన ఆంధ్రప్రదేశ్ వర్కిం గ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(ఏపీ డబ్ల్యూజేఎఫ్)మహాసభ విజయవంతం అయింది. ఈ సభకు రాఘవులు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి అతిథులు గా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కే సాంబశివ రావు,జిల్లా ప్రధాన కార్య దర్శి ఎం.బి,నాథన్ హాజర య్యారు.సమావేశం అనం తరం మైలవరం నియోజ కవర్గ నూతన కమిటీ ఎన్ని క జరిగింది.ఈ కమిటీలో నియోజకవర్గ అధ్యక్షులు గా సల్మాన్,ప్రధాన కార్య దర్శిగా వీసం సురేష్ బాబు ఎన్నికయ్యారు.గౌరవఅధ్య క్షుడిగా టంగుటూరి శ్రీనివా స్,ఉపాధ్యక్షులుగా తుపా కుల హరికృష్ణ,చాట్ల విజ యకుమార్,ఎం రమేష్, కోశాధికారిగా మేకల భాను సహాయ కార్యదర్శిలుగా సి.హెచ్,రాంబాబు,పల్లె నరేష్ కార్యవర్గ సభ్యులు గా మంతెన శ్రీనివాసరావు, అడపా శివ, చల్లా రవీంద్ర క్రోముది,ఏ.బాబు,రాజా రెడ్డి,ప్రకాష్ లు కమిటీలో ఉన్నారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎంబి నాథ న్ మాట్లాడుతూ ఇబ్రహీం పట్నంలో గతంలో జిల్లా మహా సభకి అధిక సంఖ్య లో జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు హాజరై విజయవంతం చేశారు. గతంలో నియోజకవర్గంలో పనిచేసిన APWJF నాయ కులు జర్నలిస్టుల సమస్య లపట్ల స్పందిస్తూ..అలాగే జర్నలిస్టులకు ఇండ్ల స్థలా ల విషయంలోనూ తీవ్రంగా కృషిచేసి అనేకమంది జర్న లిస్టులకు ఇండ్ల స్థలాలు ప్రభుత్వం నుంచి అందేలా పోరాడిందన్నారు. నూత నంగా ఏర్పడిన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ మైలవరం నియోజకవర్గం లో ఏపీడబ్ల్యూజేఎఫ్ శాఖ ను విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం

నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన ప్రజాప్రెస్ క్లబ్ ని ఇదే వేదిక పై సభ్యులను ప్రకటించిం ది.ఈ కార్యక్రమానికి వివిధ పార్టీ నేతలు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు అయిన ప్రజాప్రెస్ క్లబ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి