సామ్‌సంగ్ గెలాక్సీ Z Fold 7, Flip 7 ధరలు విడుదల – ₹89,999 నుంచి ప్రారంభం

samsung-galaxy-z-fold-7-flip-7-price-in-india

జూలై 9న సామ్‌సంగ్ గెలాక్సీ Unpacked ఈవెంట్‌లో మూడు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు విడుదల

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మరో అడుగు ముందుకు వేసింది సామ్‌సంగ్. జూలై 9న జరిగిన గెలాక్సీ Unpacked ఈవెంట్‌లో, సౌత్ కొరియా దిగ్గజం సామ్‌సంగ్ ఇండియాలో మూడు కొత్త ఫోల్డబుల్ ఫోన్లను అధికారికంగా ప్రకటించింది: Galaxy Z Fold 7, Galaxy Z Flip 7, మరియు Galaxy Z Flip 7 FE.

ఈ సారి మరింత స్లిమ్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఎయ్ ఐ ఫీచర్లతో ఈ ఫోన్లు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నారు. “Galaxy AI ఫోన్స్”గా కూడా పిలవబడుతున్న ఇవి, Gemini Live, Now Bar, Now Brief వంటి కొత్త ఎయ్ ఐ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

అయితే ఈ ఫోన్లకు ఫీచర్లు ఎంత శక్తివంతంగా ఉన్నా… ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కాబట్టి కొనుగోలు చేసేముందు పూర్తి ధర వివరాలు తెలుసుకోవడం మంచిది.

భారత్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ Z Fold 7 ధరలు:

వెర్షన్లు & ధరలు:

  • 12GB RAM + 256GB స్టోరేజ్ – ₹1,74,999
  • 12GB RAM + 512GB స్టోరేజ్ – ₹1,86,999
  • 16GB RAM + 1TB స్టోరేజ్ – ₹2,10,999

అందుబాటులో ఉండే కలర్స్:
బ్లూ షాడో, సిల్వర్ షాడో, జెట్‌బ్లాక్, మింట్ (మింట్ కలర్ కేవలం Samsung.com లో మాత్రమే లభ్యం)

గెలాక్సీ Z Flip 7 ధరలు:

వెర్షన్లు & ధరలు:

  • 12GB RAM + 256GB స్టోరేజ్ – ₹1,09,999
  • 12GB RAM + 512GB స్టోరేజ్ – ₹1,21,999

కలర్స్: బ్లూ షాడో, జెట్‌బ్లాక్, కొరల్ రెడ్, మింట్ (మింట్ కలర్ కేవలం Samsung.com లో)

గెలాక్సీ Z Flip 7 FE ధరలు:

వెర్షన్లు & ధరలు:

  • 8GB RAM + 128GB స్టోరేజ్ – ₹89,999
  • 8GB RAM + 256GB స్టోరేజ్ – ₹95,999

కలర్స్: బ్లాక్, వైట్

ప్రీ-ఆర్డర్ ఆఫర్లు:

  • గెలాక్సీ Z Fold 7 లేదా Flip 7 కొనుగోలు చేస్తే, ₹12,000 విలువైన స్టోరేజ్ అప్‌గ్రేడ్ ఉచితం
  • Z Flip 7 FE ప్రీ-బుకింగ్‌పై ₹6,000 విలువైన స్టోరేజ్ అప్‌గ్రేడ్ ఉచితం
  • అంతేకాదు, అన్నీ మోడల్స్‌పై 24 నెలల వరకు నో కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి.

ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే Samsung.com, Amazon.in, Flipkart.com లలో ప్రారంభమయ్యాయి. అధికారిక విక్రయాలు జూలై 25 నుంచి ప్రారంభమవుతాయి.

ప్రత్యేకతలు:

  • Snapdragon 8 Elite ప్రాసెసర్ తో వేగవంతమైన మల్టీటాస్కింగ్
  • Android 16 ఆధారిత OneUI 8
  • కొత్తగా ప్రవేశపెట్టిన AI ఫీచర్లు – Gemini Live, Now Bar, Now Brief మొదలైనవి
  • మునుపటి జనరేషన్ కంటే మెరుగైన స్లిమ్ ఫోల్డబుల్ డిజైన్
Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి