హైదరాబాద్:
మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు ట్రైలర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. జూలై 24న విడుదల కానున్న ఈ భారీ చిత్రం ట్రైలర్ నేడు విడుదల కాగా, దాన్ని చూసిన చిరంజీవి ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు.
“వాట్ యాన్ ఎలక్ట్రిఫయింగ్ ట్రైలర్!” అంటూ ప్రారంభించిన చిరంజీవి, “దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కల్యాణ్ బాబును వెండితెరపై అగ్నిపర్వతంలా చూడటం చాలా ఆనందం కలిగించింది,” అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఎనర్జీ, ట్రైలర్‌లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను మెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా చిత్ర బృందానికి చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు ఏఎం జ్యోతికృష్ణ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, నటీనటులు బాబీ డియోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్‌లను ట్యాగ్ చేస్తూ అభినందనలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. చిరంజీవి నుంచి వచ్చిన ప్రశంసలతో సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



