కూలిన ఎయిర్ ఇండియా విమానం, “MAY DAY CALL” అంటే ఏమిటి తెలుసా…!?

ప్రస్తుతం అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళాలిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ.ఐ 171 విమాన ప్రమాదం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక చేదువార్తగా ఓ విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మొత్తం 242 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి.ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదని పలు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.ఇక పోతే గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం క్షణాలలోనే దేశవ్యాప్తంగా తెలిసి పోయింది.అహ్మదాబాద్ నుండి ఇంధనం నింపుకుని బయలుదేరిన ఈ విమానం పోతూ…పోతూ నే….కొంత దూరం వెళ్ళాక ఉన్నపళంగా కుప్పకూలి అదీ అక్కడికి సమీపం లోనే అహ్మదాబాద్ వద్ద ఓ మెడికల్ కాలేజీ మెస్ భవనంపై కూలింది.దానితో భారీగా మంటలు చెలరేగడం ఆ మంటల్లోనే ప్రయాణీకులు దహన మయ్యారు అనేది ఎయిర్ ఇండియా విమానం యొక్క ప్రమాద వార్త. మరి ఈ వార్తలో ఎక్కడ చూసినా MAY DAY…, MAY DAY…అని మన తెలుగు ప్రజలకు బాగా తెలిసి ఉన్న ఒక పదం వినిపిస్తోంది,కనిపిస్తుంది అసలు ఈ విమాన ప్రమాదం వార్తలలో కొత్తగా వినిపిస్తున్న ఈ పదం ఏమిటో….? తెలుసుకుందాం.

ఆకాశంలోకి ఎగిరి వెళు తున్న విమానాలు ప్రమాదకరమైన సమస్యలు, దానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురైనప్పుడు, ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు ఉందని ఫ్లైట్ ఇచ్చే అత్యవసరమైనటు వంటి ఎలర్ట్ కాల్ అని సమాచారం. అలాగే విమానం మంటల్లో చిక్కుకున్నా,విమానం ఇంజన్ లోపం,మరో విమానాన్ని ఢీ కొట్టే పరిస్థితులు ఉన్నా, మరే ఏ ప్రమాద పరిస్థితుల్లో ఉన్నా… ఆ విమానం యొక్క ఫైలెట్ దగ్గరలో ఉన్న విమానాశ్రయం సిబ్బందికి అత్యవసర కాల్ చేయడం జరుగుతుంది. దీనినే “MAY DAY Call” అని అంటారు.ఆ కాల్ వచ్చిన వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది ఎలర్ట్ కావడం జరుగుతుంది.ఏ విమానం నుండైనా….ఏ ఫైలెట్ నుండైనా ఈ MAY DAY కాల్ ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ కి వెళ్ళగానే అక్కడ వెంటనే విమానం దిగడానికి,రన్ వే క్లియరెన్స్,అంబులెన్స్,అగ్ని మాపక వాహనం దాని సిబ్బంది మొత్తం ప్రమాదంలో ఉన్న విమానానికి, అందులో ప్రయాణికులు, ఇతర సిబ్బందికి సహాయ పడటం జరుగుతుంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి