OG సినిమా పోస్టర్ పై ఈ గుర్తు 火 ఏమిటి…?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీ.ఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నూతన చిత్రం ఓ.జి, విడుదల కోసం సినీ అభిమానులు,మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ అభిమానులు రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు తమ అభిమాన హీరో చిత్రం 25 సెప్టెంబర్2025 న విడుదల కానున్న నేపథ్యంలో పవన్ అభిమానులు ఓ.జి, సినిమా రిలీజు వేళని లెక్కించుకుంటున్నారు.ఇక ఈ ఓ.జి,సినిమా2022 డిసెంబరులో ప్రకటించబడి 2023లో ముంబైలో షూటింగ్ ప్రారంభించ బడింది.అయితే ఓజీ మూవీ రిలీజ్ కన్నా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు విడుదల కు సిద్ధంగా ఉన్నది.దీని తర్వాతనే ఓ.జీ,సినిమా విడుదల కాబోతోంది.

ఇక ఈ సినిమా టైటిల్ కూడా ఓ ప్రత్యేకతను సూచిస్తుంది.O.G,అంటే ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టార్’ గా చెప్పబడుతోంది.ఈ సినిమా చాలా ప్రత్యేకతలను కలిగివుంది. ప్రధానంగా ఈ చిత్రం పోస్టర్లుపై కనిపిస్తున్న ఒక గుర్తు సినీ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా కనిపిస్తుంది.O.G పోస్టర్ పై ఈ సింబల్ ‘‘ కి అర్థం ఏంటనేది చూద్దాం.పవన్ కళ్యాణ్ O.G సినిమాకి సంబంధించిన పోస్టర్లు ఆసక్తికరంగా మారుతున్న సంగతి పాఠకులకు తెలి సిందే.పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైలు లుక్ తో పాటు,ముఖ్యంగా చైనీస్ భాషలో కనిపించే గుర్తును వేశారు.ఆ గుర్తు పెడుతూ సినిమా పోస్టర్ కి మంచి లుక్ తో సినీ ప్రేక్షకులకు మరింతగా ఆశక్తిని పెంచేస్తున్నారు.ఇక తాజా గా ‘‘ ఈ చైనీస్ సింబల్ తో ఆసక్తిని పెంచగా ఇంత కీ దాని అర్థం ఏమిటి అనేది తెలుసుకోవాలని చాలా మంది చూస్తున్నా రు. ‘‘ చైనీస్ భాషలో ఈ గుర్తు యొక్క అర్థం ‘ఫైర్’. అలాగే తెలుగులో ‘మండే నిప్పు’ అని అర్థం సూచిస్తుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్,అతని రేంజ్ కు తగ్గట్టుగానే పోస్టర్ పై ఆ గుర్తు పెట్టడం మరింత హైప్ ను పెంచుతోందట…!ఇక ఈ చిత్రం నుంచి ముందు, ముందు ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయనే ది కూడా మరో ఆశక్తిగా మారింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి