సినిమా అంటే వినోదం, మరి వినోదం పంచాల్సిన మన తెలుగు సినిమా ఇప్పుడు ఒక రకమైన టువంటి మా*ఫియాగా మారింది. ప్రస్తుత మరో అడుగు ముందుకేసి చూస్తే మరి ముఖ్యంగా తెలుగు సినిమా రాజకీయ చట్రం లో చిక్కుకుపోయినట్లు కనిపిస్తుంది.తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు కనిపిస్తున్న పరిణామాలపై,ముఖ్యం గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమాల విడుదల సమయంలో తలెత్తుతున్న వివాదాలపై రాష్ట్ర పర్యాటక,సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కందు ల దుర్గేశ్ సంచలన వ్యాఖ్య లు చేశారు.పవన్ కల్యాణ్ సినిమా విడుదల సమ యంలోనే రాష్ట్రంలో థియేటర్ల బంద్ వంటి సమస్యలు తెరపైకి వస్తున్నాయని,అలా రావడం వెనుక ఏదో… కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.అవును ఈ అనుమానాలు పవన్ కల్యాణ్ గత చిత్రం “భీమ్లా నాయక్” నుండి ఉన్నాయి. ఇకపోతే గతంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న వేళల్లో సినీ ప్రముఖులు చేతులు కట్టు కుని నిలబడ్డారని,కానీ ప్రస్తుతం ప్రభుత్వంతో సంబంధం లేదన్నట్లుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని మంత్రి ప్రశ్నించారు.
ఇది అలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీరుపై వైసీపీ నేత,మాజీ మంత్రి పేర్నినాని శనివారం తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డా రు.గతంలో సినిమా టికెట్ల ధరల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల ను ఆయన గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక పవ న్ మాట మార్చారని పేర్ని ఆరోపించారు.సినిమా థియేటర్ల యాజమాన్యా లను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన పెద్ద ఎత్తున మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రజలు తక్కు వ ధరలతో సినిమాలు చూడాలని పవన్ ఆకాం క్షించడాన్ని పేర్ని నాని ప్రస్తా వించారు.గతంలో ఇదే పవన్ కల్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడారని, సినిమా అనేది మాది,మా ఇష్టం వచ్చిన ధరకుటికెట్స్ అమ్ముకుంటామని ఆయన అన్నారని గుర్తుచేశారు. మరి ఇప్పుడు అధికారం లోకి వచ్చాక ఆయన ఏం చేస్తున్నారు? అని పేర్ని నాని మీడియాతో అన్నా రు.అధికారంలో ఉన్నప్పు డు ఒకలా,ప్రతిపక్షం అయి తే మరోలా మాట్లాడటం పవన్ కు తగదని హితవు పలికారు.
సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై మాట్లాడుతూ,చిత్ర పరి శ్రమకు మేలు చేస్తానంటూ ఆ శాఖను చేపట్టినమంత్రి, ఇప్పుడు థియేటర్ల యాజ మాన్యాలపై విచారణకు ఆదేశించడం ఏంటని నాని ప్రశ్నించారు.”సినిమా వాళ్ల కు గొడవలు జరుగుతున్న సమయంలో జైల్లో వేస్తామ ని బెదిరిస్తున్నారు.మీ చెప్పుచేతుల్లో ఉన్న మంత్రి తో ఇలాంటి బెదిరింపులకు పాల్పడతారా అంటూ… పవన్ తన చిత్రం విడుదల కోసం ఇంతలా చేయాలా… అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.సినిమా వాళ్లను బెదిరించడానికి మీరెవరని,అసలు వారి సమస్యేంటో మీకు తెలు సా?అని ఆయన పవన్ను ఉద్దేశించి ఆవేశంతో ప్రశ్నిం చారు.రాబోయే తన కొత్త చిత్రం కోసం చేస్తున్న రాజ కీయాలు కాదా…ఇవి? అని ఆయన ప్రస్తుత సినిమాపై మండిపడ్డారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీ ఓ నలుగురు వ్యక్తుల చేతిలో చిక్కుకుని ఉందని వారిపే ర్లు కూడా బయటకు రావా ల్సి ఉందని పలువురి సినీ ప్రముఖుల వాదన.ఇక సినీ థియేటర్స్ విషయా నికి వస్తే ఇవి ఎవరి చేతు ల్లో చిక్కుకుని ఉన్నాయని మొత్తం బయటకు రావా ల్సిన అవసరం ఉంది. అప్పుడే తెలుగు సినిమా పరిశ్రమలో లోబడ్జెట్ సిని మాలకు అవకాశం ఉంటుంది.ఎన్డీఏ ప్రభు త్వం ఈ మాఫి*యాకి చెక్ పెట్టకపోతే తెలుగు చిత్రాని కి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.