రానున్న నాలుగు రోజుల్లో రెండు అల్పపీడనాలు, తెలుగు రాష్ట్రాలకు ఎలర్ట్

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ సంధర్భంగా మరోవైపు, మే 27వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర దిశలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాల ద్వారా తెలుస్తుంది.ఇది గానీ ఏర్పడిన అనంతరం రెండు రోజుల్లో మరింత బలపడే సూచనలున్నాయని అధికారులు వాతావరణ హెచ్చరికల ద్వారా తెలుస్తుంది.దీని ప్రభావం కారణంగా ఇటు కోస్తాంధ్ర,అటు యానాం ప్రాంతాల్లో మే 26 మరియు 27 రెండు తేదీల్లో అక్కడక్కడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.ఇక రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు స్థాయిలో వర్షాలు, ఉరుములు,మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండగా,గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఒక అంచనా. అలాగే మరో నాలుగు రోజుల్లో కోస్తాంధ్రలో బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల పై వేగంతో, ఒక్కోసారి 70 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశంతో పాటు వడగళ్ల వానలు కురిసే పరిస్థితులు ఉన్నాయని ఐ.ఎం.డి జాతీయ మీడియాలో వెల్లడించినట్లు తెలుస్తుంది.

మరో విషయం పరిగణ లోకి తీసుకుంటే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు త్వరగా రానున్నట్లు సమాచారం వెల్లడి కాగా రానున్న రెండు,మూడు రోజుల్లో కేరళలో తీరాన్ని తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా మారినట్లు తెలుస్తుంది.ఆ తర్వాత దేశంలో దక్షిణ ప్రాంతాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ఈ అల్పపీడనాలు, రుతుపవనాల కదలికలు చురుకుగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

అటు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం విషయానికి వస్తే రాబోయే 36 గంటల్లో మరింత బలపడి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది.ఈ అల్పపీడనం నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉండటంతో తెలంగాణలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలిక నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.అలాగే ఉరుములు,మెరుపులతో వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణశాఖ అధికారులు.ముఖ్యంగా మే 26వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. మంచిర్యాల,కొమరం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల నిజామాబాద్, జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని,ఆ సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరికలు వెలువడ్డాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి